టాలీవుడ్ లో ప్రముఖ నటుడు సాయాజీ షిండే అందరికీ సుపరిచితమే.. టాలీవుడ్ లో తనకంటూ ఒక సపరేట్ స్టేటస్ ను  కూడా సంపాదించుకున్నారు. అయితే ఇప్పుడు తాజాగా ఈయన హాస్పిటల్ బెడ్ పైన పడుకుని ఉన్న ఒక ఫోటో అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే నిన్నటి రోజున ఈయన ఆరోగ్య సమస్యతో హాస్పిటల్లో అడ్మిట్ అయినట్లుగా తెలుస్తోంది.  ఈ సందర్భంగా ఈ ఫోటో తీసినట్లుగా సమాచారం. ఛాతీలో గట్టిగా నొప్పి రావడంతో వెంటనే ఆయన కుటుంబ సభ్యులు ఆయనని ఆసుపత్రికి చేర్చినట్లుగా తెలుస్తోంది.

హాస్పిటల్లో డాక్టర్లు కూడా ఆయనకు కొన్ని పరీక్షలు చేయించిన తర్వాత  సాయాజీ షిండే గుండెల్లో వెయిన్ బ్లాక్ ఉన్నట్లుగా గుర్తించారట. దీంతో ఆయనకు యాంజియోప్లాస్టి చేసినట్లుగా తెలుస్తోంది.. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి బాగుందని.. త్వరలోనే డిశ్చార్జ్ చేస్తామంటూ కూడా వైద్యులు తెలియజేశారు.. దీంతో అభిమానుల సైతం కాస్త ఊపిరి పీల్చుకున్నారు.. కుటుంబ సభ్యులు కూడా త్వరలోనే సాయాజీ షిండే నార్మల్గా అయ్యి తిరిగి వస్తారని తెలియజేశారు. ప్రస్తుతం ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది.


సాయాజీ షిండే మొదట జెడి చక్రవర్తి నటించిన సూర్య సినిమా ద్వారా తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చారు. ఆ తర్వాత చిరంజీవి నటించిన ఠాగూర్ సినిమాతో మంచి క్రేజ్ సంపాదించుకున్న సాయాజీ షిండే.. పలువురు స్టార్ హీరో చిత్రాలలో విలన్ రోల్స్ లో కూడా మెప్పించారు. తెలుగులో స్టార్ స్టేటస్ సంపాదించుకున్న సాయాజీ షిండే మహారాష్ట్ర ప్రాంతానికి చెందిన వ్యక్తి.. తెలుగులోనే కాకుండా ఎన్నో భాషలలో కూడా పలు చిత్రాలలో నటించి మంచి క్రేజ్ సంపాదించుకున్నారు.


2023 లో వచ్చిన ఏజెంట్ , నరసింహ సినిమాలో కనిపించారు. ఆ తర్వాత మరే సినిమాలో కూడా సాయాజీ షిండే కనిపించలేదు. ప్రస్తుతం సాయాజీ షిండే త్వరగా కోలుకోవాలని అభిమానులు సైతం కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: