టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న యంగ్ హీరోయిన్స్ లలో ఒకరు శ్రీలీల. తెలుగు సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. పెళ్లి సందడి సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమైనటువంటి ఈమె మొదటి సినిమాతోనే చాలామంది అభిమానులను సొంతం చేసుకున్నారు.ఇక ఈమె నటించిన ధమాకా సినిమా సూపర్ హిట్ కావడంతో తెలుగులో ఈమెకు భారీ స్థాయిలో అవకాశాలు వచ్చాయి. అయితే శ్రీలీల నటించిన అన్ని సినిమాలు పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయారు. ఇలా హిట్ ప్లాపుల తో సతమతమవుతున్నటువంటి ఈమె ప్రస్తుత మాత్రం సినిమా లకు కాస్త దూరంగా ఉన్నారు.ఈమె పవన్ కళ్యాణ్ హీరో గా నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా లో నటిస్తున్నారు. ఈ సినిమా తప్ప తన చేతిలో ఎలాంటి సినిమాలు లేవు అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ రాజకీయాల లో బిజీ గా ఉండటం వల్ల ఈ సినిమా షూటింగ్ కూడా వాయిదా పడటంతో ఈమె ప్రస్తుతం ఖాళీ గానే ఉన్నారు.

ఇక షూటింగ్స్ ఏమీ లేకపోవడం తో పలు షాపింగ్ మాల్స్ ప్రారంభోత్సవ కార్యక్రమా లలో కూడా పాల్గొని సందడి చేస్తున్నారు.  ఇకపోతే ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భం గా ఈమె తెరి వెనుక స్టార్ హీరోలు పడే కష్టాల గురించి మాట్లాడితే చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. చాలామంది హీరోలు శ్రీలీల తో డాన్స్ చేయాలంటే చాలా కష్టమని తెలియ జేశారు. ఇక ఈ విషయం గురించి ఈమె మాట్లాడుతూ డ్యాన్స్ కంటే టాలీవుడ్ హీరోలు చేస్తున్న యాక్షన్ సీన్స్ చాలా కష్టమని చెప్పారు. మన కథనాయకులు సినిమాల కోసం, యాక్షన్ సీక్వెన్స్ కోసం పెద్ద ఎత్తున కష్టపడుతుంటారనీ తెర వెనుక హీరోల కష్టం గురించి ఈమె మొదటిసారి మాట్లాడుతూ చేసినటువంటి ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: