హిందీ సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు కలిగిన నటలలో ఒకరు అయినటువంటి అజయ్ దేవగన్ తాజాగా మైదాన్ అనే మూవీ లో ప్రధాన పాత్రలో నటించాడు. భారత ఫుట్‌బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీమ్ బయోపిక్ గా తెరకెక్కిన ఈ మూవీ కి అమిత్ శర్మ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన నటిమనులలో ఒకరు అయినటువంటి ప్రియమణి ఓ కీలక పాత్రలో నటించింది. 

మూవీ నిన్న అనగా ఏప్రిల్ 11 వ తేదీన భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల అయ్యింది. మొదటి నుండి ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మంచి కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు ప్రపంచవవ్యాప్తంగా వచ్చిన కలెక్షన్ లకి సంబంధించిన అధికారిక ప్రకటనను విడుదల చేసింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు వచ్చినట్లు ఈ మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది.

ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియాలో అవుతుంది. ఇక ఈ మూవీ కి మంచి పాజిటివ్ టాక్ రావడం మొదటి రోజు మంచి కలెక్షన్ లు రావడాన్ని బట్టి చూస్తే ఈ మూవీ లాంగ్ రన్ లో మంచి కలెక్షన్ లను రాబట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సంవత్సరంలో ఇప్పటికే సైతాన్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్న అజయ్ దేవగన్ "మైదాన్" మూవీ తో మరో విజయాన్ని కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

ad