తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న దర్శకులలో ఒకరు అయినటువంటి శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వరుణ్ సందేశ్ ,  తమన్నా భాటియా , రాహుల్ హరిదాస్ , నిఖిల్ సిద్ధార్థ్ , వంశీ కృష్ణ , సోనియా దీప్తి , గాయత్రీ రావు , మోనాలీ చౌదరి ముఖ్య పాత్రలలో 2007 సంవత్సరం హ్యాపీ డేస్ అనే మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. విడుదలకు ముందు పెద్దగా అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదల అయిన ఈ మూవీ విడుదల అయిన తర్వాత ప్రేక్షకుల నుండి అద్భుతమైన మౌత్ టాక్ ను తెచ్చుకుంది. 

దానితో ఈ మూవీ కి కలెక్షన్ లు రోజు రోజుకు పెరుగుతూ వచ్చాయి. అలా ఆ సమయంలో భారీ కలెక్షన్ లను వసూలు చేసిన ఈ మూవీ అద్భుతమైన విజయాన్ని టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకుంది. ఇకపోతే 2007 వ సంవత్సరం లో బాక్స్ ఆఫీస్ దగ్గర సంచలన విజయం అందుకున్న ఈ సినిమాని తిరిగి మళ్ళీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

మూవీ ని ఏప్రిల్ 19 వ తేదీన థియేటర్ లలో మళ్లీ విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది. తాజాగా హ్యాపీ డేస్ మూవీ యూనిట్ ఈ చిత్ర రీ రిలీజ్ కు సంబంధించిన టికెట్ బుకింగ్స్ ను ఓపెన్ అయినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. మరి ఈ మూవీ రీ రిలీస్ కోసం ఎప్పటి నుండో చాలా మంది సినీ ప్రేమికులు ఎదురు చూస్తున్నారు. మరి ఈ మూవీ రీ రిలీజ్ లో భాగంగా ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: