కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి తలపతి విజయ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ తమిళ సినిమాలలో నటించి ప్రస్తుతం కోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ హీరోలలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇతను తాను నటించిన ఎన్నో తమిళ సినిమాలను తెలుగు లో కూడా విడుదల చేశాడు. అందులో కొన్ని మూవీ లు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలు సాధించడంతో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో కూడా మంచి గుర్తింపు ఉంది.

ఇకపోతే తాజాగా విజయ్ తన తల్లి శోభ కోరిక మేరకు చెన్నై లో సాయి బాబా దేవాలయాన్ని కట్టించారు. దీనిపై విజయ్ తల్లి స్పందిస్తూ ... బాబా మందిరం నిర్మించాలని ఉందని విజయ్ తో ఎన్నో సార్లు చెప్పా. నా ఇష్టాన్ని అర్థం చేసుకొని అతను ఈ గుడిని కట్టించాడు. ప్రతి గురువారం నేను ఇక్కడికి వచ్చి పూజలు చేస్తా. విజయ్ కూడా అప్పుడప్పుడు వస్తుంటాడు అని విజయ్ తల్లి పేర్కొంది.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం విజయ్ , వెంకట్ ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గోట్ అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ ని సెప్టెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తమిళ్ , తెలుగు , హిందీ భాషలలో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది. ఇందులో విజయ్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఈ సినిమాపై తమిళ సినీ ప్రేమికులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇప్పటికే ఈ మూవీ నుండి కొన్ని ప్రచార చిత్రాలను ఈ మూవీ యూనిట్ విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: