కొంత కాలం క్రితం వరకు మలయాళ సినీ పరిశ్రమ చాలా చిన్నది. ఇక్కడి సినిమాలకు వంద కోట్ల కలెక్షన్లు అనేది చాలా పెద్ద మార్క్. కానీ వీరు ప్రస్తుతం వైవిధ్యమైన సినిమాలను తెరకెక్కిస్తూ వంద కోట్ల కలెక్షన్లను చాలా సింపుల్ గా రాబడుతున్నారు. ఇది ఇలా ఉంటే మలయాళ ఇండస్ట్రీ లో అత్యధిక కలెక్షన్లు వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

మంజుమ్మల్ బాయ్స్ : పెద్దగా స్టార్ కాస్ట్ లేకుండా భారీ అంచనాలు లేకుండా విడుదల అయిన ఈ సినిమా ఇప్పటికే 230 కోట్ల కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా వసూలు చేసి మలయాళ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే తెలుగులో విడుదల కాగా ప్రస్తుతం ఈ సినిమాకు తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి కలెక్షన్ లు లభిస్తున్నాయి.

2018 : 2018 వ సంవత్సరం కేరళలో జరిగిన ప్రకృతి విపత్తు ఆధారంగా తెరకెక్కించిన ఈ సినిమా 176 కోట్ల కలెక్షన్ లతో మలయాళ ఇండస్ట్రీ లో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన సినిమాల లిస్టులో రెండవ స్థానంలో నిలిచింది.

పులి మురుగన్ : మోహన్ లాల్ హీరోగా రూపొందిన ఈ సినిమా 150 కోట్ల కలెక్షన్లను వసూలు చేసి ప్రస్తుతం మలయాళ సినీ పరిశ్రమలో అత్యధిక కలెక్షన్లను వసూలు చేసిన మూవీల లిస్టులో మూడవ స్థానంలో కొనసాగుతుంది.

ప్రేమలు : ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 136 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ సినిమాలలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మూవీల లిస్టు లో నాలుగవ స్థానంలో కొనసాగుతుంది.

ది గోట్ లైఫ్ : పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా రూపొందిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇప్పటి వరకు ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 128 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసి మలయాళ సినిమాలలో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన మూవీల లిస్టు లో 5 వ  స్థానంలో కొనసాగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: