బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్ తాజాగా మైదాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు.  అమిత్ శర్మ దర్శకత్వం వహించిన ఈ మూవీ లో ప్రియమణి , గజరాజ్ రావ్ , రుద్రనీల్ ఘోష్ , చైతన్య శర్మ తదితరులు ముఖ్య పాత్రలలో నటించారు. ఏ ఆర్ రెహమాన్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... బోనీ కపూర్ , జీ స్టూడియోస్ , అరుణవ్ రాయ్ సేన్‌గుప్తా , ఆకాష్ చావ్లా ఈ మూవీ ని నిర్మించారు. అనేక సార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ సినిమా తాజాగా ఏప్రిల్ 11 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది.

మూవీ కి విడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి మౌత్ టాక్ రావడంతో ఈ మూవీ మొదటి రోజు ప్రపంచ వ్యాప్తంగా 10.70 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ విషయాన్ని ఈ చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మూవీ కి మంచి టాక్ రావడంతో లాంగ్ రన్ లో ఈ చిత్రానికి భారీ కలెక్షన్ లు వచ్చే అవకాశం ఉంది. ఈ మూవీ లో అజయ్ దేవగన్ నటనకు గాను ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి మంచి ప్రశంసలను అందుకుంటున్నాడు.

ఇక తాజాగా ఈ సినిమా ఓటిటి పార్ట్నర్ లాక్ అయినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను కొన్ని వారాల తర్వాత అమెజాన్ ప్రైమ్ వీడియో సంస్థ వారు తమ డిజిటల్ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయబోతున్నట్లు తెలుస్తోంది.  అజయ్ దేవ్గన్ వరుసగా దృశ్యం 2 ... సైతాన్ మూవీ లతో రెండు విజయాలను అందుకున్నాడు. ఈ మూవీ తో కూడా సక్సెస్ ను అందుకున్నట్లు అయితే అజయ్ దేవగన్ హైట్రిక్ విజయాలను అందుకున్నట్లు అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: