విజయ్ దేవరకొండ తాజాగా పరుశురామ్ పట్ల దర్శకత్వంలో రూపొందిన ది ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరోగా నటించాడు. గతంలో వీరి కాంబోలో గీత గోవిందం అనే మూవీ రూపొందింది. ఆ సినిమా అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ విజయ్ నీ  టాలీవుడ్ ఫ్యామిలీ ఆడియన్స్ కు దగ్గర చేసింది. ఇక వీరి కాంబోలో రూపొందిన గీత గోవిందం మంచి విజయం సాధించడంతో ది ఫ్యామిలీ మ్యాన్ మూవీ అనౌన్స్ అయినప్పటినుండి ఈ సినిమాపై తెలుగు ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

అలా మంచి అంచనాల నడుమ ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన థియేటర్ లలో విడుదల అయ్యింది. భారీ అంచనాలు ఈ సినిమాపై కలిగి ఉన్న నేపథ్యంలో ఈ మూవీ కి పెద్ద మొత్తంలో ప్రి రిలీజ్ బిజినెస్ జరిగింది. కానీ ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో ఈ మూవీ పెద్ద మొత్తంలో కలెక్షన్ లను రాబట్టడంలో విఫలం అవుతుంది. ప్రస్తుతం ఈ సినిమాకు వస్తున్న కలెక్షన్ లను బట్టి చూస్తే ఈ మూవీ కి పెద్ద మొత్తంలో నష్టాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. 

ఇక ఈ విషయం కాసేపు పక్కన పెడితే... ఈ మూవీ యొక్క శాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ వారు భారీ ధరకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఈ సినిమాను కొన్ని వారాల థియేటర్ రన్... ఆ తర్వాత కొన్ని వారాల ఓ టి టి రన్ కంప్లీట్ అయిన తర్వాత వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా స్టార్ మా చానల్లో ఈ మూవీ ప్రసారం కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... గోపి సందర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు ఈ మూవీ ని నిర్మించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: