టాలీవుడ్ లో స్టార్ కమెడియన్ గా గుర్తింపు పొందిన సత్యం రాజేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. సత్యం సినిమా తో మంచి కమెడియన్‌ గా గుర్తింపు తెచ్చుకున్న టాలీవుడ్ నటుడు సత్యం రాజేశ్‌ ఆ తర్వాత కామెడియన్‌ గా తనకంటూ సెపరేట్ ఇమేజ్ సంపాదించుకున్నాడు.ఇక ఈ కామెడియన్ హీరో గా మారిన సంగతి తెలిసిందే. గతేడాది 'మా ఊరి పొలిమేర' 2 అంటూ వచ్చి సత్యం రాజేష్ సూపర్ హిట్ అందుకున్నాడు. 'మా ఊరి పొలిమేర' సినిమా కు సీక్వెల్‌గా వచ్చిన ఈ చిత్రం బ్లాక్‌ మేజిక్‌ కాన్సెప్ట్‌ తో తెరకెక్కి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమా అనంతరం సత్యం రాజేష్ వరుస సినిమాలను లైన్‌ లో పెడుతున్నాడు. తాజాగా సత్యం రాజేష్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ “టెనంట్” ఫ్యామిలీ ఎమోషనల్ థ్రిల్లర్‌ గా వస్తున్న ఈ చిత్రానికి వై.యుగంధర్ దర్శకత్వం వహిస్తున్నాడు. 

ఇప్పటికే ఈ సినిమా నుంచి టీజర్‌ తో పాటు ట్రైలర్ ను విడుదల చేయగా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు తాజాగా మూవీ నుంచి మేకర్స్ రిలీజ్‌ ట్రైలర్ విడుదల చేశారు.ప్రస్తుత సమాజంలో మహిళలు ఎంత అప్రమత్తంగా ఉండాలో తెలియజేసేలా ఈ ట్రైలర్ సాగింది. ‘టెనంట్ ‘ మూవీ శ్రీరామనవమి కానుక గా ఏప్రిల్ 19న విడుదల చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని మహాతేజ క్రియేషన్స్ బ్యానర్ పై మోగుళ్ళ చంద్రశేఖర్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మేఘా చౌదరి, చందన పయావుల మరియు భరత్ కాంత్ వంటి తదితరులు ఈ సినిమా లో కీలక పాత్రలు పోషిస్తున్నారు.ఈ చిత్రానికి సాహిత్య సాగర్ సంగీతం అందిస్తున్నారు.ఇదిలా ఉంటే “పొలిమేర 2” సినిమా తో హిట్ అందుకున్న సత్యం రాజేష్ త్వరలోనే “పొలిమేర 3” తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు..

మరింత సమాచారం తెలుసుకోండి: