జబర్దస్త్.. తెలుగు బుల్లితెరపై ఇది ఒక సెన్సేషన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. సాదాసీదా కామెడీ షో గా ప్రారంభమైన జబర్దస్త్ కార్యక్రమం తెలుగు బుల్లితెరపై  సరికొత్త చరిత్ర సృష్టించింది. ఏకంగా టాప్ రేటింగ్స్ సొంతం చేసుకుంటూ ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చిన్నల నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరు కూడా జబర్దస్త్ ను చూసి నవ్వుకోవడం మొదలుపెట్టారు. కాగా సినిమాల్లో దొరకని సరికొత్త ఎంటర్టైన్మెంట్ ద్వారా ప్రేక్షకులకు దొరికేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే కేవలం ప్రేక్షకులను నవ్వించడమే కాదు ఎంతోమంది అప్ కమింగ్ కమెడియన్స్ కి  మంచి వేదికగా కూడా మారిపోయింది జబర్దస్త్.


 ఈ షోలో గుర్తింపును సంపాదించుకున్న ఎంతోమంది  ప్రస్తుతం సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్నారు. ఇంకొంతమంది బిగ్ బాస్ లాంటి షోలకు వెళ్లి తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నారు. అయితే ఇలా ఇటీవల కాలంలో జబర్దస్త్ లో తన టాలెంట్ తో బాగా పాపులర్ అయిన కమెడియన్ నూకరాజు అద్భుతమైన కామిడీ టైమింగ్ తో పంచులు పేలుస్తూ ఎప్పుడూ బుల్లితెర ప్రేక్షకులను నవ్విస్తూ ఉంటాడు. ఇక ప్రస్తుతం జబర్దస్త్ లో టీం లీడర్ గా కొనసాగుతున్నాడు అన్న విషయం తెలిసిందే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నూకరాజు జబర్దస్త్ లో ఉన్న పరిస్థితులపై షాకింగ్ కామెంట్స్ చేశాడు. దాదాపు రెండున్నరేళ్ళ పాటు ఎన్నో అవమానాలను ఎదుర్కొని కష్టపడితే ఇప్పుడు టీం లీడర్ గా ఛాన్స్ వచ్చింది అంటూ చెప్పుకొచ్చాడు.


 జబర్దస్త్ లోని సీనియర్స్, టీం లీడర్స్ ఎప్పుడు కుళ్ళు రాజకీయాలు చేస్తుంటారు. ఒకానొక సమయంలో ఇలాంటి కుళ్ళు రాజకీయాలను భరించలేకపోయాను అంటూ నూకరాజు తెలిపాడు. షోలో టాలెంట్ గురించి పట్టించుకునేది చాలా తక్కువ. కావాల్సిన వాళ్ళని హైలెట్ చేయడానికి ప్రయత్నిస్తారు. కనీసం డైలాగ్ చెప్పడం రాకపోయినా వాళ్ళకు హైప్ ఇస్తూ ఉంటారు  ఈ విషయంపై ప్రశ్నించినప్పుడు నన్ను కొన్ని ఎపిసోడ్స్ నుంచి తీసేసారు. మరికొన్నిసార్లు ప్రోమోలో కనపడకుండా చేశారు. ఆ సమయంలో ఎంతో గానో బాధపడ్డాను. అయితే నా రైటింగ్  నన్ను కాపాడుతూ వచ్చింది. ఆడియన్స్ కి చేరువ చేసింది అంటూ నూకరాజు చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: