సినిమా ఇండస్ట్రీలో వారసత్వం అనేది కొన్ని దశాబ్దాలుగా కొనసాగుతూ వస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్న సీనియర్ హీరోల దగ్గర నుంచి యంగ్ స్టార్ హీరోల వరకు కూడా అందరూ ఇలా స్టార్ కిడ్స్ గా ఇండస్ట్రీకి పరిచయమై తమకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకొని రాణిస్తున్న వారే. అయితే ఇండస్ట్రీలో ఇలాంటి ట్రెండ్ ఇప్పటికీ కూడా కొనసాగుతుంది. స్టార్ హీరో కొడుకు హీరో అవ్వాలని.. డైరెక్టర్ కొడుకు డైరెక్టర్ అవ్వాలని.. కమెడియన్ కొడుకు కమెడియన్ అవ్వాలని అభిమానులు కోరుకుంటూఉంటారు.


 ఇంకొంతమంది ఇలాంటి వారసత్వాన్ని నమ్ముకొని ఇక ఇండస్ట్రీలో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ ఉంటారు. అయితే ప్రస్తుతం టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ సైతం ఇలా నందమూరి అనే బ్యాగ్రౌండ్ తోనే ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చారు. ఎన్టీఆర్ మనవడిగా హరికృష్ణ కొడుకుగా ఇండస్ట్రీకి పరిచయమై.. ఇక ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా ఎదిగారు. అయితే ఇక ఎన్టీఆర్ లాగానే ఆయన ఇద్దరు కొడుకులు కూడా ఇండస్ట్రీకి హీరోలుగా పరిచయం అవుతారని అభిమానులు అనుకుంటూ ఉండగా.. ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ వైరల్ గా మారింది.


 తన ఇద్దరు కొడుకులను సినిమా హీరోలుగా పరిచయం చేయాలని ఎన్టీఆర్ అనుకోవట్లేదట. మరో రంగంలోకి పంపాలని అనుకుంటున్నాడట. ఎన్టీఆర్ కొడుకులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లను ఇండస్ట్రీలో హీరోలుగా కాకుండా డాక్టర్ వృత్తిలో సెటిల్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నాడట జూనియర్ ఎన్టీఆర్. ఇక తారక్ భార్య లక్ష్మీ ప్రణతి కూడా ఇదే డెసిషన్ తీసుకుందట. ఈ విషయం తెలిసి అభిమానులు అందరూ కూడా డీలా పడిపోతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ తర్వాత ఆ స్థానం దక్కించుకునేది భార్గవ్, అభయ్ అనుకుంటూ అభిమానులు ఆశపడుతూ ఉంటే.. తారక్ తీసుకున్న డెసిషన్ మాత్రం మా ఆశలపై నీళ్లు చల్లినట్లు ఉంది అని అభిమానులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: