బుల్లితెరపై యాంకర్లుగా ఒక వెలుగు వెలుగుతున్న వారి గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అక్కర్లేదు. ఇలా ఎన్నో ఏళ్ల నుంచి తన వాక్చాతుర్యంతో బులితె ప్రేక్షకులు అందరిని ఆకట్టుకుని స్టార్ యాంకర్స్ గా గుర్తింపును సంపాదించుకున్న వారిలో శ్యామల కూడా ఒకరు. చిన్న వయసులోనే యాంకరింగ్ వృత్తి లోకి వచ్చిన ఆమె ఇక ఇప్పుడు తెలుగు ప్రేక్షకులు అందరికీ సుపరిచితురాలుగా ఎంతో మంది అభిమానులకు ఫేవరెట్ యాంకర్ గా కొనసాగుతూ ఉంది.


 అయితే కేవలం బుల్లితెరపై మాత్రమే కాకుండా వెండితెరపై కూడా కనిపిస్తూ అభిమానులను అలరిస్తుంది. ఇక ఇటీవల కాలంలో అయితే వరుసగా అవకాశాలను అందుకుంటుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న యాంకర్ శ్యామల తన భర్త పెళ్లయిన కొత్తలోనే తనకు ఒక డ్రగ్ అలవాటు చేశాడు అంటూ షాకింగ్ విషయాలు చెప్పింది. ప్రస్తుతం అది లేకపోతే తాను జీవించలేకపోతున్నాను అంటూ యాంకర్ శ్యామల చేసిన కామెంట్స్ వైరల్ గా మారిపోయాయి. ఒకవైపు యాంకర్ గా మరోవైపు బుల్లితెరపై నటిగా కెరియర్ కొనసాగిస్తున్న సమయంలోనే ఇక తోటి నటుడు నరసింహతో ప్రేమలో పడింది యాంకర్ శ్యామల.


 ఈ విషయాన్ని దాచి చాలా కాలం పాటు సీక్రెట్ గానే లవ్ ట్రాక్ నడిపించింది. తర్వాత కొంతకాలానికి పెళ్లి చేసుకోవాలనుకున్న కుటుంబాలు ఒప్పుకోకపోవడంతో చివరికి ఎలాగోలా ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక వీరి ప్రేమకు గుర్తుగా ప్రస్తుతం ఒక బాబు జన్మించాడు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు యాంకర్ శ్యామల. తనకు యాంకరింగ్ పై ఆసక్తి ఉండేది కాదు అంటూ చెప్పుకొచ్చింది. కానీ తన భర్త యాంకరింగ్ వైపు వెళ్ళు వెళ్ళు అంటూ తోసాడని.. అలా యాంకరింగ్ వైపు అడుగులు వేసిన తనకు కొంచెం కొంచెంగా ప్రేమ పెరిగింది అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇప్పుడు ఆయన ఎక్కించిన యాంకరింగ్ అనే డ్రగ్ వల్ల ఇప్పుడు తాను దానిని వదలలేని పరిస్థితికి వచ్చినట్లు చెప్పుకొచ్చింది శ్యామల.  అయితే ఇలా యాంకరింగ్ కోసం డ్రగ్ అనే పదం వాడటం మాత్రం వైరల్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: