ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో , వ్యక్తిత్వంతో ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ తెలుగు సినిమా పరిశ్రమలో చిరంజీవి స్టార్ హీరోగా ఎదిగాడు. స్టార్ హీరో గా ఎదగడం మాత్రమే కాకుండా ఎంత ఎదిగిన ఒదిగి ఉండాలి అనే వ్యక్తిత్వంతో ఎంతో మంది సన్నిహితులను సంపాదించుకున్నారు. ఇక టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోగా కెరీర్ ను కొనసాగిస్తున్న సమయం లోనే చిరంజీవి "ప్రజారాజ్యం" అనే పార్టీని స్థాపించి రాజకీయాల వైపు దృష్టి మళ్లించాడు.

అందులో భాగంగా రాజకీయాల్లో ఉన్న సమయంలో చిరంజీవి సినిమాలు నటించలేదు. కేవలం రాజకీయాలపై దృష్టి పెట్టాడు. కానీ రాజకీయాలలో చిరంజీవి పెద్దగా సక్సెస్ కాలేదు. దానితో తాను పెట్టిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి మళ్లీ తిరిగి సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చాడు. ఇక ఎంతో మంది చిరంజీవి మళ్ళీ రాజకీయాల్లోకి వెళతాడా అనే అనుమానాలను ఇప్పటికీ కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇక వాటికి చిరంజీవి తాజాగా అదిరిపోయే ఆన్సర్ ఇచ్చేశాడు.

తాజాగా చిరంజీవి మాట్లాడుతూ ... సినీ నటుడిగా ఉన్నప్పుడు నాకు చేతనైనంత మేరకు జనాలకు సహాయం చేశాను. ఇంకా మంచి చేయాలి అని రాజకీయాల్లోకి వెళ్లాను. కాకపోతే నా లాంటి వ్యక్తిత్వం ఉన్న వారికి రాజకీయం పెద్దగా సూట్ కాదు. అందుకే వాటిని వదిలేసి మళ్లీ సినిమాల్లోకి వచ్చాను. సినిమాల్లోకి వచ్చేటప్పుడు నన్ను పూర్వం ఆదరించినట్లుగానే జనాలు ఆదరిస్తారా..? అనే ఒక అనుమానం ఉండేది. కానీ మళ్ళీ రీ ఎంట్రీ ఇచ్చాక నన్ను అప్పుడు ఎలా చూసారో ఇప్పుడు అలానే చూస్తున్నారు దానికి జనాలకు ధన్యవాదాలు. ఇకపై చచ్చేంత వరకు సినిమాల్లోనే నటుడు గానే ఉంటాను. రాజకీయాల వైపు అస్సలు వెళ్ళను అని చిరంజీవి తాజాగా స్పష్టం చేశాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: