మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి తాజాగా డాక్టరేట్ అవార్డు దక్కిన విషయం మన అందరికీ తెలిసిందే. తాజాగా ఈయనకు డాక్టరేట్ ను పురస్కరించారు. అందులో భాగంగా చరణ్ మాట్లాడుతూ ... తాను ప్రస్తుతం నటిస్తున గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించిన అనేక వివరాలను మరియు ఆ సినిమాను ఎప్పుడు విడుదల చేయబోతున్నాం అనే విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ మాట్లాడుతూ ... నేను ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాను.

మూవీ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందుతుంది. నేను నా కెరియర్ లో ఇప్పటి వరకు ఎప్పుడూ కూడా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ లో నటించలేదు. అందుకే నాకు ఇది చాలా స్పెషల్ సినిమా. ఇకపోతే ఈ సినిమా షూటింగ్ మరికొన్ని రోజుల్లోనే పూర్తి కాబోతోంది. ఈ మూవీ ని ఈ సంవత్సరం సెప్టెంబర్ లేదా అక్టోబర్ నెలలో తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయబోతున్నాం అని తాజాగా గేమ్ చేంజర్ మూవీ కి సంబంధించిన చాలా ఇంట్రెస్టింగ్ విషయాలను చరణ్ చెప్పుకొచ్చాడు.

ఇకపోతే ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ నుండి చిత్ర బృందం ఒక పాటను విడుదల చేయగా దానికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. ఇక ఈ సినిమా విడుదల తేదీ ఫిక్స్ అయినట్లు అయితే ఈ మూవీ ప్రచారాలను కూడా ఈ మూవీ యూనిట్ పెంచబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ తర్వాత చరణ్ , బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఓ మూవీవలోను ... సుకుమార్ దర్శకత్వంలో ఓ మూవీ లోను నటించడానికి ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. ఈ మూవీ లకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ లు కూడా ఇప్పటికే వచ్చేసాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: