మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని సదా గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఈమె నితిన్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కిన జయం మూవీ తో వెండి తేరకు పరిచయం అయ్యింది. ఇందులో పల్లెటూరి అమ్మాయిల పద్ధతి గల పాత్రలో నటించిన ఈమె తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. అలాగే ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి సక్సెస్ ను సాధించడంతో ఈ నటికి జయం మూవీ తో తెలుగు లో మంచి గుర్తింపు ఏర్పడింది. 

ఆ తర్వాత వరుసగా ఈమెకు తెలుగు సినిమాల్లో అవకాశాలు దక్కాయి. అలాంటి సమయం లోనే ఈమే తమిళ సినీ పరిశ్రమ వైపు అడుగులు వేసింది. అందులో భాగంగా విక్రమ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన అపరిచితుడు అనే మూవీలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ ముద్దుగుమ్మ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. దానితో చాలా సంవత్సరాల పాటు ఈమె ఇటు తెలుగు అటు తమిళ ఇండస్ట్రీ లలో క్రేజ్ ఉన్న హీరోయిన్ గా కెరీర్ ను కొనసాగించింది. 

ప్రస్తుతం మాత్రం ఈమె అడపాదడపా సినిమాలలో నటిస్తూ కొన్ని టీవీ షో లకు జడ్జిగా వ్యవహరిస్తూ కాలాన్ని ముందుకు సాగిస్తుంది. సినిమాలలో ఎన్నో సార్లు తన అందాలను ఆరబోసిన ఈ బ్యూటీ సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఓలకబోస్తోంది. అందులో భాగంగా ఈ నటి తాజాగా అదిరిపోయే లుక్ లో ఉన్న సిల్వర్ కలర్ డ్రెస్ ను వేసుకొని హాట్ యాంగిల్స్ లో ఉన్న కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం అది వైరల్ అవుతున్నాయి. ఇలా ఈమె సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా తన అందాలను ఆరబోస్తూ కుర్రకారు ప్రేక్షకులను బాగా అలరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: