ప్రస్తుతం వరుస విజయాలతో తెలుగు సినీ పరిశ్రమలో మంచి జోష్ లో కెరియర్ ను ముందుకు సాగిస్తున్న వారిలో సుహాస్ ఒకరు. ఈయన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. కొంత కాలం క్రితం ఈ నటుడు కలర్ ఫోటో అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ ఓటిటి లోనే విడుదల అయినప్పటికీ ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ ను తెచ్చుకుంది. ఈ సినిమాతో ఈయనకు హీరోగా మంచి గుర్తింపు లభించింది. 

ఆ తర్వాత ఈ నటుడు ఫ్యామిలీ డ్రామా అనే సినిమాలో కూడా కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ లోని నటనకు కూడా సుహాస్ కి మంచి గుర్తింపు లభించింది. పోయిన సంవత్సరం సుహాస్ "రైటర్ పద్మభూషణ్" అనే మూవీతో ప్రేక్షకులను పలకరించి మంచి విజయం అందుకున్నాడు. ఈ సంవత్సరం అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించి మరో విజయం అందుకున్నాడు.

ఇలా వరుస విజయాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈయన ప్రస్తుతం "ప్రసన్న వదనం" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. అర్జున్ వై కే దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాను మణికంఠ , ప్రసాద్ రెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మూవీ ని మే 3 వ తేదీన థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ ఓవర్సీస్ హక్కులను ఈ చిత్ర బృందం ఇప్పటికే అమ్మివేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల చేశారు.

సినిమా యొక్క ఓవర్సీస్ హక్కులను ది విలేజ్ గ్రూప్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా యూఎస్ఏ లో మే 2 వ తేదీనే ఈ మూవీ ప్రీమియర్స్ ప్రదర్శించనున్నట్లు ఈ సంస్థ వారు ప్రకటించారు. వరస విజయాల తర్వాత సుహష్ నటిస్తున్న మూవీ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: