మెగాస్టార్ చిరంజీవి ఎంతో గొప్ప ఆంజనేయ స్వామి భక్తుడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే చిరంజీవి తాను నటించిన ఎన్నో సినిమాలలో కూడా తనను ఆంజనేయుడి భక్తుడిగా ఎంతో మంది దర్శకులు చూపించారు. అలాంటి పాత్రలలో చిరంజీవి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను మరింతగా అలరించిన సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. ఇక కొన్ని రోజుల క్రితమే తేజ సజ్జ హీరోగా ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి అద్భుతమైన విజయం సాధించింది.

ఇకపోతే ఈ సినిమా విడుదలకు ముందు ఈ మూవీ బృందం నిర్వహించిన ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా విచ్చేశాడు. అందులో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ... నేను గొప్ప ఆంజనేయ భక్తుడిని అనే విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. మీ అందరికీ తెలుసు అని తెలియజేయడం మాత్రమే కాకుండా ... ఆంజనేయుడిని అతను ఎంత నమ్మేవాడు అనే విషయం గురించి కూడా చాలా విషయాలను చెప్పుకొచ్చాడు. ఇకపోతే మరోసారి హనుమాన్ సినిమాకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలను చిరంజీవి చేశాడు.

తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చిరంజీవి మాట్లాడుతూ ... తాజాగా వచ్చిన హనుమాన్ సినిమా నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. ఎందుకంటే హీరో తేజ తన ప్రయాణంలో ఒక భాగం. నన్ను స్ఫూర్తిగా తీసుకున్న తేజ ఈ చిత్రంతో దేశ వ్యాప్తంగా గొప్ప గుర్తింపును సంపాదించుకున్నాడు. అలాగే హనుమాన్ కాన్సెప్ట్ తో గతంలో నేను సినిమా చేయాలి అనుకున్నాను అని కూడా చిరంజీవి తాజాగా చెప్పుకొచ్చాడు. ఇక ప్రస్తుతం చిరంజీవి , మల్లాడి వశిష్ట దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంభర అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం చాలా రోజుల క్రితమే ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: