మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా నటించిన లేటెస్ట్ యాక్షన్ ఎంటర్ టైనర్ భీమా. ఈ సినిమాను శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌లో నిర్మాత కెకె రాధా మోహన్ నిర్మించారు
దర్శకుడు ఎ హర్ష ఈ మూవీని తెరకెక్కించారు.కన్నడ డైరెక్టర్ అయిన హర్షకు తెలుగులో ఇది తొలి సినిమా కావడం విశేషం.. భీమా మూవీలో గోపీచంద్ సరసన ప్రియ భవానీ శంకర్ మరియు మాళవిక శర్మ హీరోయిన్స్‌గా నటించారు. పవర్ ఫుల్ పోలీస్ కథతో తెరకెక్కిన భీమా సినిమా మార్చి 8వ తేదీన థియేటర్స్‌లోకి వచ్చింది. మాస్ ఎంటర్ టైనర్‌గా వచ్చిన భీమా మూవీ ప్రేక్షకుల్ని ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా బీ, సీ సెంటర్స్ ఆడియెన్స్ కి ఈ సినిమా తెగ నచ్చేసింది.ఇదిలా ఉంటే భీమా సినిమా తాజాగా ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. మాస్ మూవీస్ ఇష్టపడే ప్రేక్షకులు భీమా ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ సంస్థ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్  సొంతం చేసుకుంది.


తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్‌పై డిస్నీ ఫ్లస్ హాట్ స్టార్ అధికారిక ప్రకటన చేసింది..భీమా మూవీ ఏప్రిల్ 25 న డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్‌కు రాబోతోంది. థియేటర్లలో విడుదలైన  సుమారు 50 రోజులకు ఈ సినిమా ఓటీటీలోకి రాబోతుంది..ఈ మూవీ తెలుగుతోపాటు తమిళం మరియు మలయాళం మూడు భాషల్లో స్ట్రీమింగ్ కానుందీ.డిస్నీ ఫ్లస్ హాట్‌స్టార్‌లోనూ భీమా సినిమాకు మంచి రెస్పాన్స్ రానున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ సినిమాను థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఇప్పుడు ఓటీటీ రిలీజ్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాబట్టి భీమా ఓటీటీకి వెర్షన్ కి మంచి రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంది. భీమాలో గోపీచంద్ రెండు పాత్రలు పోషించినట్లు తెలుస్తుంది. ఈ మూవీ ముఖేష్ తివారి, వెన్నెల కిశోర్, రఘుబాబు, నాజర్ మరియు నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సలార్, కేజీఎఫ్ చిత్రాలతో గుర్తింపు పొందిన రవి బస్రూర్ సంగీతం అందించారు

మరింత సమాచారం తెలుసుకోండి: