కెరియర్ ప్రారంభంలో ఎన్నో తెలుగు సినిమాలలో నటించి టాలీవుడ్ ఇండస్ట్రీలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న నటిమానులలో నమిత ఒకరు . ఈమె "సొంతం" అనే సినిమాతో మంచి విజయాన్ని అందుకొని తెలుగులో మంచి క్రేజ్ ను సంపాదించుకుంది . ఆ తర్వాత విక్టరీ వెంకటేష్ హీరో గా రూపొందిన జెమిని, బాలకృష్ణ హీరోగా రూపొందిన సింహ, ప్రభాస్ హీరోగా రూపొందిన బిల్లా సినిమాల్లో కూడా ఈ బ్యూటీ నటించింది.

ఈ మూవీలతో ఈమె మంచి గుర్తింపును సంపాదించుకుంది . ఇక ప్రస్తుతం మాత్రం ఈమె సినిమా ఇండస్ట్రీకి చాలా దూరంగా ఉంటుంది. కొంతకాలం క్రితమే బీజేపీ పార్టీలోకి చేరి ప్రస్తుతం రాజకీయంగా ఎదగాలి అని చూస్తోంది. ఇక ప్రస్తుతం రాజకీయాలతో ఫుల్ బిజీగా ఉన్న ఈ బ్యూటీ వచ్చే ఎన్నికల్లో కోలీవుడ్ స్టార్ హీరో పై పోటీ చేయనున్నట్లు ప్రకటించింది.

2026 వ సంవత్సరం తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతున్న విషయం మనకు తెలిసిందే. ఆ ఎన్నికల్లో కోలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి దళపతి విజయ్ పై తాను పోటీ చేస్తాను అని నమిత తాజాగా ప్రకటించింది. రాజకీయాల్లో చాలా బలమైన ప్రత్యర్థి మరియు తెలివైన ప్రత్యర్థి పైనే పోటీ చేస్తే రాజకీయ ఎదుగుదల ఉంటుంది అని... అందుకే విజయ్ పై పోటీ చేయాలి అని నిర్ణయించుకున్నట్లు ఈ బ్యూటీ తెలియజేసింది.

విజయ్ పై పోటీ చేయనున్నట్లు నమిత ప్రకటించడంతో అలా కనుక చేసినట్లు అయితే ఈమెకు డిపాజిట్లు కూడా ఆ ఏరియాలో దక్కవు అని దళపతి ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఇకపోతే ప్రస్తుతం విజయ్ , వెంకట ప్రభు దర్శకత్వంలో రూపొందుతున్న గోట్ అనే మూవీలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీని సెప్టెంబర్ 5వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందం ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: