యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ , హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలలో "వార్ 2" అనే మూవీ రూపొందుతున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది . ఈ మూవీ తాజా షెడ్యూల్ లో పాల్గొనడం కోసం ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ముంబై కి చేరుకున్నాడు . ప్రస్తుతం ఈయనపై సన్నివేశాలను కూడా చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది . ఇక పోతే ఈ సినిమాలో కియార అద్వానీ హీరోయిన్ గా కనిపించబోతుంది.

దానితో ఈ బ్యూటీ కూడా ఈ సినిమా షూటింగ్ లో త్వరలో జాయిన్ కాబోతున్నట్లు తెలుస్తోంది . ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కియారామూవీ షూటింగ్ లో మే 1 వ తేదీ నుండి జాయిన్ కాబోతున్నట్లు కొన్ని రోజుల పాటు ఈమెపై సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది . ఇప్పటికే వార్ మూవీ మంచి విజయం సాధించడంతో "వార్ 2" మూవీ పై ఇండియావ్యాప్తంగా ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.  

ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటించనున్న నేపథ్యంలో ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఇప్పటికే ఏర్పడ్డాయి. మరి ఈ సినిమా ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో... ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుంటుందో తెలియాలి అంటే చాలా కాలం వేచి చూడాల్సిందే.

ఇది ఇలా ఉంటే ప్రస్తుతం కియార అద్వానీ ... మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీలో కూడా హీరోయిన్గా నటిస్తోంది. శంకర్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. చరణ్, శంకర్ కాంబోలో రూపొందుతున్న మూవీ కావడంతో ఈ మూవీపై కూడా దేశవ్యాప్తంగా అంచనాలు భారీగా ఉన్నాయి. ఇలా ప్రస్తుతం కియార చేతిలో రెండు అదిరిపోయే క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: