ఇండియా వ్యాప్తంగా మంచి గుర్తింపు కలిగిన నటీమణులలో ఒకరు అయినటువంటి జాన్వీ కపూర్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అందులో భాగంగా ఈమె తన పెళ్లి ఎలా జరగాలి అనే దాని గురించి క్లారిటీగా చెప్పుకొచ్చింది. తాజాగా జాన్వి తన పెళ్లి ఎలా జరగాలి అనే దాని గురించి మాట్లాడుతూ... నా పెళ్లి ని తిరుమలలో సాంప్రదాయ బద్దంగా చేసుకోవాలని ఉంది. నా పెళ్లిలో నేను కాంచీపురం పట్టు చీరను ధరించి... మల్లెపూలను పెట్టుకోవాలని ఉంది.

నాకు కాబోయే భర్త కూడా పంచే కట్టుకోవాలి. అతిథులకు అరటి ఆకుల్లో విందు భోజనం పెట్టాలి. నాకు కొంచెం సిగ్గు కాబట్టి కొంతమందిని మాత్రమే ఆహ్వానిస్తా. ఎక్కువ మంది వస్తే నన్నే చూస్తుంటారు. దానితో నాకు చాలా ఇబ్బంది ఉంటుంది అని జాన్వి కపూర్ చెప్పుకొచ్చింది.

ఇక జాన్వి కపూర్ సినిమాల విషయానికి వస్తే ... ప్రస్తుతం ఈమె జూనియర్ ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాకు అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నాడు. మొత్తం రెండు భాగాలుగా విడుదల కానున్న ఈ సినిమా యొక్క మొదటి భాగం ఈ సంవత్సరం అక్టోబర్ 10వ తేదీన విడుదల కానుంది.

ఇకపోతే ఈ సినిమా విడుదల కాకముందే ఈ బ్యూటీ మరో తెలుగు సినిమాలో హీరోయిన్గా ఎంపిక అయ్యింది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా బుచ్చిబాబు సన దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ ప్రారంభం కాబోతోంది. ఈ సినిమాలో ఈ బ్యూటీ హీరోయిన్గా కనిపించబోతుంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీ పూజా కార్యక్రమాలకు జాన్వీ కపూర్ కూడా అటెండ్ అయ్యింది. ఇలా ఈ బ్యూటీ ప్రస్తుతం ఒక టాలీవుడ్ క్రేజీ మూవీలో నటిస్తూ... మరో తెలుగు క్రేజీ మూవీ లో నటించడానికి రెడీగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: