ఉప్పెన సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది కృతి శెట్టి. బుచ్చిబాబు దర్శకత్వంలో మెగా హీరో వైష్ణవ్ తేజ హీరోగా నటించిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. యూత్ ఫుల్ ఎమోషనల్ లవ్ డ్రామా నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరోయిన్ అయిపోయింది కృతి శెట్టి. ఈ సినిమా తర్వాత ఈ బ్యూటీ కి వరుస సినిమాల్లో నటించే ఆఫర్స్ వచ్చాయి. ఏకంగా న్యాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో హీరోయిన్గా నటించే అవకాశాన్ని దక్కించుకుంది. ఇక ఈ సినిమా సైతం భారీ విజయాన్ని అందుకుంది.

సినిమా తర్వాత బంగారు రాజు సినిమాలో నటించింది. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా సైతం భారీ విజయాన్ని అందుకుంది. అలా ఈ ముద్దుగుమ్మకి గోల్డెన్ లెగ్ అన్న పేరు సైతం వచ్చింది.. అలా వరుసగా సినిమాలు చేసి విజయాలు రావడంతో ఈ ముద్దుగుమ్మ రెమ్యూనరేషన్ సైతం అమాంతంగా పెంచేసింది. అయితే ఎప్పుడైతే రెమ్యూనరేషన్ పెంచేసిందో అప్పటినుండి ఈ బ్యూటీ కి సినిమాల్లో నటించే అవకాశాలు రావడం తగ్గిపోయాయి. ఆ తర్వాత ఏ హీరోతో సినిమా చేసిన ఆ సినిమాలన్నీ ఫ్లాపులుగా మారాయి. ఈ మూడు సినిమాల తర్వాత ఈ బ్యూటీ చేసిన మాచర్ల నియోజకవర్గం ఆ అమ్మాయి గురించి  మీకు చెప్పాలి

   వారియర్ వంటి సినిమాలు అన్నీ కూడా వరుసగా ఫ్లాప్స్ గా నిలిచాయి. ఆ తర్వాత నాగచైతన్య కి జోడిగా నటించిన కష్టడి సినిమా సైతం  ఫ్లాప్ టాక్ సంపాదించుకుంది.  ప్రస్తుతం ఆమె తెలుగులో శర్వానంద్ కి జంటగా ఓ చిత్రం చేస్తున్నారు. మలయాళ, తమిళ భాషల్లో ఒకటి రెండు ఆఫర్స్ ఉన్నాయి. తెలుగులో నిలదొక్కుకోవాలని ఈ భామ బాగా ట్రై చేస్తుంది. ఈ మధ్య సోషల్ మీడియాలో అందాల డోస్ కూడా పెంచింది. అలానే నిర్మాతలకు కృతి శెట్టి బంపర్ ఆఫర్ ఇచ్చింది. రెమ్యునరేషన్ తగ్గించుకుందట. గతంలో రూ. 2 కోట్లు డిమాండ్ చేసిన కృతి శెట్టి కోటి, కోటిన్నర ఇచ్చినా పర్వాలేదని అంటుందట.

మరింత సమాచారం తెలుసుకోండి: