టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ సీతారామం సినిమా హీరోయిన్ మృణాల్ ఠాగూర్ జోడిగా నటించిన లేటెస్ట్ సినిమా ఫ్యామిలీ స్టార్. పరశురాం దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏప్రిల్ ఐదున గ్రాండ్ గా విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా మొదటి రోజు నుండే పాజిటివ్ టాక్ అందుకుంది. వసూళ్ల పరంగా కూడా బాగానే రాబట్టింది. కానీ ఆ తరువాత మాత్రం సోషల్ మీడియాలో కొందరు సినిమాపై నెగిటివ్ టాక్ స్ప్రెడ్ చేయడంతో నిదానంగా సినిమా కలెక్షన్స్ తగ్గిపోయాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.

అలా చేయడం వల్ల సినిమాకి అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ కూడా రాలేదు. అంతేకాదు సినిమా విడుదల కాకముందే టీజర్ ట్రైలర్ పాటలతో మంచి క్రేజ్  సంపాదించుకున్న ఈ సినిమా అంత పెద్ద హిట్ సాధించలేదు అని చెప్పొచ్చు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మించిన ఈ సినిమా తెలుగుతోపాటు హిందీ భాషలో కూడా విడుదలై అక్కడ కూడా మంచి రెస్పాన్స్ సాధించింది. ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఈ సినిమా ఓటిటి రిలీజ్ డేట్ పై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున రచ్చ జరుగుతుంది.

అయితే ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తోంది. త్వరలోనే దానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. తాజా సమాచారం ప్రకారం ఈ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుందని తెలుస్తోంది. అలాగే ఈ చిత్రాన్ని మే 3వ తేదీ నుంచి అందుబాటులోకి తీసుకురానున్నట్లు సమాచారం. అయితే దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుందని అంటున్నారు. గతంలో డైరెక్టర్ పరుశురామ్, విజయ్ దేవరకొండ కాంబోలో వచ్చిన గీతా గోవిందం బ్లాక్ బస్టర్ హిట్ అయిన సంగతి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: