టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు టాలీవుడ్ యంగ్ హీరోయిన్ శ్రీ లీల జంటగా నటించిన లేటెస్ట్ సినిమా గుంటూరు కారం. ఇక ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకో లేకపోయినప్పటికీ పాజిటివ్ టాక్ మాత్రం తెచ్చుకుంది. అయితే వీరిద్దరూ జంటగా నటించిన ఈ సినిమాలోని కూర్చి మడత పెట్టి అనే పాట సోషల్ మీడియాలో ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికీ ఈ పాట సోషల్ మీడియా లో ట్రెండింగ్ లో ఉంది.

అంతేకాదు ఈ పాట యూట్యూబ్లో సరికొత్త రికార్డును క్రియేట్ చేసింది అని చెప్పొచ్చు. మహేష్ బాబు శ్రీ లీలా నటించిన ఈ ఎనర్జిటిక్ ట్రాక్ లిరిక్స్ మాస్ డాన్స్ స్టెప్పులతో అదరగొట్టేసారు. అయితే తెలుగులోనే కాకుండా ఈ పాట అటు టాలీవుడ్ బాలీవుడ్ ను ఒక ఊపు ఊపేసింది అని చెప్పొచ్చు. అంతేకాదు ఏకంగా ఆఫ్రికా ఖండానికి కూడా విస్తరిస్తోంది ఈ పాట. అయితే అప్పట్లో అలా వైకుంఠపురం లో సినిమాలోని బుట్ట బొమ్మ పాట ఎంతలా వైరల్ అయిందో ఇప్పుడు ఈ పాట కూడా అంతలా వైరల్ అవుతుంది. ఇక ఆ పాటకి అప్పట్లో సెలబ్రిటీలు వివిధ దేశాలకు చెందినవారు అందరూ కూడా రీల్స్ చేశారు.  

అదే విధంగా ఇప్పుడు కూడా కూర్చి మడత పెట్టి పాట పై అందరూ రీల్స్ చేస్తున్నారు. వివిధ దేశాలకు చెందిన వారు సినీ సెలబ్రిటీలు సైతం ఈ పాటకి స్టెప్పులు వేస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా.. ఇన్ స్టా రీల్స్ లో ఆఫ్రికన్ పిల్లలు కుర్చీ మడతపెట్టి సాంగ్ కు మైమరిచిపోయే డాన్సింగ్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. అచ్చం మహేశ్ బాబులా స్టెప్పులు వేసి ఫిదా చేశారు. గ్రూప్ లో ఓ అమ్మాయి శ్రీలీల స్టెప్పులకు తగ్గట్టుగా డాన్సులు వేస్తే మిగతా పిల్లలను మహేశ్ స్టైల్ ను ఫాలో అయ్యారు. కాగా ఇటీవల అమెరికాలోని హ్యూస్టన్ ఫ్లాష్ మాబ్ ఈవెంట్ లో ఈ పాట దుమ్మురేపగా, ఇప్పుడు ఉగాండాకు చెందిన ఈ ఆఫ్రికన్ పిల్లలు తమలోని టాలెంట్ ను బయటపెడుతూ డాన్స్ చేశారు.


మరింత సమాచారం తెలుసుకోండి: