టాలీవుడ్ యంగ్ హీరో విజయ్‌ దేవరకొండ హిట్టు కొట్టి ఏకంగా ఆరేళ్లు అవుతోంది.  2017 నుంచి 2018 దాకా విజయ్ టైం మాములుగా లేదు.ఆ టైంలో విజయ్‌కి బ్లాక్‌బస్టర్‌ విజయాలు, మోస్తరు విజయాలు వచ్చాయి.2018  తర్వాత ఇప్పటి దాకా ఒక్క హిట్టు కూడా రాలేదు.ఇక ఖుషికి ఫస్ట్ డే హిట్ టాక్ వచ్చింది. అయితే ఆ సినిమా కమర్షియల్‌ హిట్‌ కాదు అని విశ్లేషకులు చెబుతుంటారు. ఆ సినిమాకి కూడా 10 కోట్ల పైగా నష్టాలు వచ్చాయి. ఇప్పుడు 'ఫ్యామిలీ స్టార్‌'తో అయినా ఏమన్నా బలంగా బౌన్స్‌ బ్యాక్‌ అవుతాడా? అని చూస్తే ఆ సినిమా రెస్పాన్స్‌ ఇంకా దారుణంగా ఉంది.సినిమా భారీ డిజాస్టర్ వైపు దూసుకుపోతుంది. కథల ఎంపిక విషయంలో, వాటిని ప్రచారం చేసుకునే విషయంలో విజయ్ దేవరకొండ మరోసారి అట్టర్ ఫెయిల్ అయ్యాడు. మళ్ళీ ఈ సినిమా ప్రమోషన్స్ లో కూడా అతి చేశాడు. ఇలా తన స్ట్రాటజీని సరి చూసుకోవాలని అభిమానులు, నెటిజన్లు అంటున్నారు. ఎందుకంటే ఆరేళ్లుగా సరైన విజయం అందుకోకపోవడానికి విజయ్ చేసే అతి కూడా ఒక కారణం. పైగా తను ఎంపిక చేసుకునే స్టోరీలు కూడా ఔట్ డేటెడ్ స్టోరీలు. కానీ విజయ్ బిల్డప్ మాత్రం అవతార్ రేంజ్ లో ఉంటుంది.


ఒక సినిమాతో హిట్టు కొట్టడం అంటే ఇంస్టాగ్రామ్ లో ఫాలోవర్స్ పెరిగినంత ఈజీ కాదు. ఆ విషయం విజయ్ కి అర్థం కావడం లేదు.సినిమాలు తేడా కొడుతున్నా ఆయన కథల ఎంపిక మారడం లేదు, సినిమాల ప్రచారం విషయంలో ఆలోచనా ఏమాత్రం మారడం లేదు. సేమ్‌ అగ్రెసివ్‌నెస్‌ను యాటిట్యూడ్ ని మెయింటైన్‌ చేస్తున్నాడు. దాంతోపాటు ప్రతి సినిమా ప్రమోషన్ కి ఒకే తరహా కామెంట్లు కూడా చేస్తున్నాడు. సినిమాకు హైప్‌ పెంచేలా పనికిమాలిన డైలాగ్‌లు కూడా వేస్తున్నాడు. 'లైగర్‌' సినిమాకు వాట్‌ లగాదేంగే అని హైప్‌ ఇవ్వగా… ఈసారి కలకాలం నిలిచే సినిమా అవార్డులు కాళ్ళ కిందకు వచ్చి పడతాయ్ అని హైప్‌ పెంచాడు.ఇంటర్వ్యూలో ఎలివేషన్లు, కెరీర్లో పడ్డ కష్టాలు, కెరీర్‌ ప్రారంభం నాటి రోజులు గుర్తుచేస్తూ ఓ చిన్నసైజు సింపతీ గెయిన్‌ చేయాలని చూస్తున్నారు అంటూ నెటిజన్లు నుండి కామెంట్లు వస్తున్నాయంటే పరిస్థితి ఖచ్చితంగా అర్థం చేసుకోవచ్చు. విజయ్ ఇలానే కొనసాగితే అతని మూవీ కెరీర్ కష్టమే. చిన్న డైరెక్టర్లు కూడా పట్టించుకోరు. ఇక ఫ్యామిలీ స్టార్ ఏప్రిల్ 21 న ఓటిటిలోకి రానున్నట్లు సమాచారం తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: