చాలామంది సినిమా దర్శకులు, నిర్మాతలు సినిమాకు సంబంధం లేకుండా కొన్ని పాటలను చిత్రీకరిస్తూ ఉంటారు  దానికి ప్రధాన కారణం ఆ పాటలు సినిమా ప్రమోషన్లకు ఎంతగానో ఉపయోగపడతాయి అని వారు భావించడమే. అలా ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు ఎంతో మంది దర్శక, నిర్మాతలు ఎన్నో సాంగ్స్ ను తెరకెక్కించే అవి సినిమాలో భాగంగా పెట్టకుండా వాటిని ముందు చివరన అతికించి వాటి ద్వారా ప్రచారాలను జోరుగా సాగించిన సందర్భాలు అనేకం ఉన్నాయి. 

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే "అరుణ్మనై 4" అనే తమిళ సినిమా "బాక్" అనే పేరుతో తెలుగులో విడుదల కానుంది. ఈ సినిమాలో మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణులు అయినటువంటి తమన్నా , రాశి కన్నా ప్రధాన పాత్రల్లో నటించగా ... సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాని ఏప్రిల్ 26 వ తేదీన విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ యూనిట్ తెలుగులో కూడా ప్రచారాలను జోరుగా చేస్తుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో తమన్నా , రాశి కన్నా కు మంచి క్రేజ్ ఉన్న విషయం మన అందరికీ తెలిసిందే.

దానితో వీరికి ఉన్న క్రేజ్ ను ఈ మూవీ బృందం బాగా ఉపయోగించుకోవాలి అని డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.  అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా నుండి ఓ సాంగును విడుదల చేసిందిఎం అందులో తమన్నా , రాశి కన్నా తమ అదిరిపోయే అందాలను ఆరబోశారు. దీనితో అప్పటివరకు ఈ సినిమా గురించి తెలియని వారు కూడా ప్రస్తుతం ఈ సినిమా గురించి తెలుసుకుంటున్నారు. ఇక ఈ సాంగ్ ను చూసినట్లు అయితే ఇది సినిమాకు సంబంధం లేకుండా వచ్చే అంశాలే ఎక్కువగా కనబడుతున్నాయి. ఇలా ఈ సినిమాలోని ఈ గ్లామర్ సాంగ్ ను కేవలం ప్రమోషన్ల కోసం మాత్రమే చిత్రీకరించినట్లు కనబడుతుంది. మరి ఈ సాంగ్ సినిమాలో అంతర్భాగంగా ఉంటుందా లేక ప్రమోషన్ల కోసం వాడిందా అనేది తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: