కోలీవుడ్ ఇండస్ట్రీ లో ప్రస్తుతం మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న వారిలో విశాల్ ఒకరు. ఈయన ఇప్పటి వరకు ఎన్నో సినిమాలలో నటించి నటుడిగా మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన నటించిన చాలా సినిమాలు తెలుగు లో కూడా విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా మంచి విజయాలను సాధించడంతో ఈయనకు టాలీవుడ్ ఇండస్ట్రీ లో కూడా మంచి గుర్తింపు ఏర్పడింది.

ఆఖరుగా విశాల్ , అధిక్ రవిచంద్రన్ దర్శకత్వంలో రూపొందిన మార్క్ ఆంటోనీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ తో విశాల్ కు మంచి క్రేజ్ లభించింది. ప్రస్తుతం విశాల్ , హరి దర్శకత్వంలో రూపొందుతున్న రత్నం అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని మరి కొన్ని రోజుల్లోనే థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి.

ఇలా వరుస సినిమాలతో కెరియర్ ను ఫుల్ బిజీగా ముందుకు సాగిస్తున్న ఈయన చాలా కాలం నుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. తాజాగా విశాల్ తన రాజకీయ ఎంట్రీ గురించి అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూ లో భాగంగా విశాల్ మాట్లాడుతూ ... త్వరలోనే ఓ రాజకీయ పార్టీని స్థాపించి 2026 వ సంవత్సరంలో తమిళ నాడు లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాను అని తెలియజేశారు. ప్రస్తుతం ప్రజలకు సరైన వసతులు లేవు అని ... వారికి సేవ చేయాలనే ఉద్దేశం తోనే రాజకీయాల్లోకి అడుగు పెట్టాలి డిసైడ్ అయినట్లు విశాల్ తాజా ఇంటర్వ్యూ లో భాగంగా చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: