ఇప్పటి వరకు తెలుగు సినీ పరిశ్రమ నుండి విడుదల అయిన సినిమా టీజర్ లలో ఎక్కువ సమయం యూట్యూబ్ లో ట్రెండింగ్ లో కొనసాగిన టాప్ 5 టీజర్ లు అవి అనే విషయాన్ని తెలుసుకుందాం.

పుష్ప పార్ట్ 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరో గా రష్మిక మందన హీరోయిన్ గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ ను కొన్ని రోజుల క్రితమే ఈ మూవీ బృందం విడుదల చేసింది. ఇకపోతే ఈ సినిమా టీజర్ విడుదల అయిన తర్వాత 138 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి మొదటి స్థానంలో నిలిచింది.

జై లవకుశ : యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరో గా బాబీ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా 137 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి 2 వ స్థానంలో నిలిచింది.

జనతా గ్యారేజ్ : జూనియర్ ఎన్టీఆర్ హీరో గా సమంత , నిత్యా మీనన్ హీరోయిన్ లుగా ... కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ 134 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి 3 వ స్థానంలో నిలిచింది.

సరిలేరు నీకెవ్వరు : సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా టీజర్ 123 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి 4 వ స్థానంలో నిలిచింది.

కాటమ రాయుడు : పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా రూపొందిన ఈ మూవీ టీజర్ విడుదల అయిన 129 గంటల పాటు యూట్యూబ్ లో టాప్ ట్రెండింగ్ లో కొనసాగి 5 వ స్థానంలో నిలిచింది.

ఇలా ఈ ఐదు సినిమాల టీజర్ లు ఇప్పటి వరకు యూట్యూబ్ లో అత్యంత ఎక్కువ సమయం టాప్ ట్రెండింగ్ లో కొనసాగిన టీజర్ ల లిస్ట్ లో టాప్ 5 స్థానాలలో నిలిచాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: