రెబల్ స్టార్ ప్రభాస్ తాజాగా సలార్ అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ లో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా ... ప్రశాంత్ నీల్మూవీ కి దర్శకత్వం వహించాడు. జగపతి బాబు , పృధ్విరాజ్ సుకుమారన్ , శ్రేయ రెడ్డి , ఈశ్వరి రావ్ ఈ మూవీ లో కీలక పాత్రలల్ నటించారు. పోయిన సంవత్సరం డిసెంబర్ 22 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యి బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత కొంతకాలానికే "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది.

ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అదిరిపోయే రేంజ్ లో అలరించింది. అలా ఇప్పటికే థియేటర్ ,  ఓ టి టి ప్రేక్షకులను అలరించడంలో సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమా మరికొన్ని రోజుల్లో బుల్లి తెర ప్రేక్షకుల ముందుకు కూడా రాబోతుంది. ఇప్పటికే అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను స్టార్ మా సంస్థ దక్కించుకుంది.

అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను ఈ నెల 21 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు తమ చానల్లో ప్రసారం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పటికే థియేటర్ , ఓ టి టి ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో ఆకట్టుకుంటుందో చూడాలి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ప్రభాస్ , నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న కల్కి సినిమాలోనూ ... మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న రాజా సాబ్ మూవీ లోను హీరో గా నటిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: