కోలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి క్రేజ్ కలిగిన నటులలో ఒకరు అయినటువంటి విశాల్ ప్రస్తుతం రత్నం అనే మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. హరి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. గతంలో విశాల్ , హరి కాంబోలో "పూజ" అనే సినిమా రూపొందింది. ఈ మూవీ అటు తమిళ్ లోను , ఇటు తెలుగు లోనూ మంచి విజయం సాధించింది. ఇక ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన పూజ మూవీ మంచి సక్సెస్ కావడంతో రత్నం మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు.

మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ ని ఏప్రిల్ 26 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసింది. మరికొన్ని రోజుల్లోనే ఈ సినిమా ప్రచారాలను కూడా ఈ మూవీ యూనిట్ ఫుల్ జోష్ లో నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే తాజాగా విశాల్ ఈ ఇంటర్వ్యూ లో పాల్గొన్నారు.

ఆ ఇంటర్వ్యూ లో భాగంగా ఈయన తన తదుపరి మూవీ కి సంబంధించిన అనేక ఆసక్తికరమైన విషయాలను చెప్పుకొచ్చాడు. తాజాగా విశాల్ మాట్లాడుతూ ... రత్నం మూవీ కి సంబంధించిన పనులు అన్నీ పూర్తి కాగానే నేనే దర్శకత్వం వహిస్తూ "తుప్పరివాలన్ 2" సినిమాను తెరకెక్కిస్తాను. మే 5 తేదీ నుండి ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలియజేశారు. కొత్తగా ఏం చేస్తాడు అని అనే వారి కోసమే ఈ సినిమా చేస్తున్నాను అని విశాల్ చెప్పుకొచ్చాడు. ఇకపోతే రత్నం మూవీ తో విశాల్ ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: