బిగ్ బాస్ ఫేం అర్జున్ అంబటి కథనాయకుడిగా వస్తున్న చిత్రం తెప్ప సముద్రం. కిశోరి దాత్రక్ హీరోయిన్‌. రవిశంకర్, చైతన్య రావు ప్రధాన పాత్రల్లో నటించారు. సతీష్ రాపోలు దర్శకత్వంలో బేబీ వైష్ణవి సమర్పణలో శ్రీమణి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ఈ సినిమా వస్తోంది. నిర్మాత నీరుకంటి మంజులా రాఘవేందర్ గౌడ్. పి. ఆర్ సంగీత దర్శకుడు. ఈ చిత్రం ఏప్రిల్ 19న ప్రేక్షకుల ముందు రాబోతుంది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా ట్రైలర్ లాంచ్, ప్రీరిలీజ్ ఈవెంట్‌ను చిత్ర యూనిట్ ఘనంగా నిర్వహించింది. హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్‌లో ఆదివారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమంలో చిత్ర యూనిట్‌తో పాటు ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.


ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి తెప్పసముద్రం సినిమాలోని మొటది పాటను లాంచ్ చేశారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి రెండో పాట... ట్రైలర్‌ను జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యుడు తల్లోజు ఆచార్య రిలీజ్ చేశారు.


ఈ కార్యక్రమంలో ఎవరేం అన్నారంటే..

మ్యూజిక్ డైరెక్టర్ పీఆర్: మమ్మల్ని ఆశీర్వదించడానికి వచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సోమచ్. ‘తెప్పసముద్రం’ చిన్న చిత్రమని చెప్పలేం. ఇదొక మంచి చిత్రం. ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుందని ఆశిస్తున్నా..

తల్లోజు ఆచార్య: ‘‘ఈ సినిమా కోసం పని చేసిన ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. నేను ఈ సినిమా ప్రివ్యూ చూశాను. సెకెండాఫ్ చాలా అద్భుతంగా ఉంది. సమాజంలో యదార్థ ఘటనలను నిర్భయంగా తెరమీదకు తీసుకొచ్చారు. బాలికలపై జరుగుతున్న దారుణాలను కళ్లకు కట్టినట్లు చూపించారు. వ్యవస్థను ప్రశ్నించేలా ఈ సినిమా ఉంది. హాజీపూర్ ఘటనను తలపించేలా ఈ సినిమా ఉంది. ప్రతి ఒక్కరూ చూడాల్సిన సినిమా ఇది. కంటెంట్ ఉన్న ప్రతి చిన్న సినిమానూ ఆదరిస్తున్న ప్రేక్షకులు ఈ సినిమాను కూడా ఆదరించాలని కోరుకుంటున్నా..

 
ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి: ‘‘నేను ఫస్ట్ టైమ్ ‘రజాకార్’ సినిమాకు గెస్ట్‌గా వచ్చా. ఇప్పుడు ‘తెప్పసముద్రం’ సినిమా కోసం వచ్చా. సైంటిస్టుల తర్వాత నేను గౌరవించేది సినిమా రంగంలోని క్రియేటర్స్‌నే. అలాంటి ఒక మంచి సబ్జెక్ట్‌ను సెలెక్ట్ చేసుకున్న ‘తెప్పసముద్రం’ టీమ్‌కు అభినందనలు. ఈ సినిమాకు పెద్ద పెద్ద స్టార్ హీరోలు లేరు. అందరూ మధ్య తరగతివారే పని చేశారు. ‘తెప్పసముద్రం’ లాంటి సినిమా హిట్ అయితే కృష్ణానగర్‌లోని ప్రతి ఒక్కరికీ పని దొరుకుతుంది. ‘తెప్పసముద్రం’ అనే మంచి సినిమాను తెలుగువారందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా


నిర్మాత మహేంద్రనాథ్: ఇదొక మంచి సోషల్ పాయింట్ మీద తీసిన సినిమా. ఇలాంటి సినిమాలు బాగా ఆడాలి. అందరూ తప్పకుండా ఈ సినిమాను చూడండి


లిరిసిస్ట్ పూర్ణాచారి: డైరెక్టర్ సతీష్ గారు నాకు పదేళ్లుగా స్నేహితుడు. ఇందులో నేను ఒక పాట రాశాను. మంగ్లీ గారు పాడారు. సినిమా అంటే కేవలం కళ కాదు. ఇది ఎంతోమందికి జీవనోపాధి. కిషోరి గారి కొరమీను సినిమాకు అన్ని పాటలూ నేనే రాశాను. ఈ సినిమా మంచి సక్సెస్ సాధించి టీమ్ అందరికీ విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా


ఎడిటర్ సాయిబాబు: జాంబిరెడ్డి, హనుమాన్ లాంటి సినిమాలతో ఎడిటర్‌గా నాకు అవకాశం ఇచ్చిన నా దర్శకుడు ప్రశాంత్ వర్మగారికి థ్యాంక్యూ. చిన్న సినిమాకు మీడియా ఎంత ప్రోత్సాహాన్ని ఇస్తుందో హనుమాన్‌తో నిరూపించారు. అలాగే ఈ సినిమాను కూడా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నా. నిజంగా ఇదొక మంచి సినిమా.


చిత్ర నిర్మాత రాఘవేంద్రగౌడ్‌: చైతన్యగారిని మా ఇంటికి ఆహ్వానించినప్పుడు ఈ సినిమా డిస్కన్ జరిగింది. అలా ఈ సినిమా ప్రారంభమైంది. మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అతిథులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఒక సినిమా రెడీ అవ్వాలంటే ఎంతోమంది కష్టపడాలి. డైరెక్టర్ గారు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. నేను చిన్నప్పటి నుంచి చిరంజీవి గారికి అభిమానిని. అలాంటి వాళ్ల స్ఫూర్తితోనే ఇండస్ట్రీకి వచ్చాను. రవిశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సినిమా ప్రతిఒక్కరూ ఎంజాయ్ చేసేలా ఉంటుంది. ఈ నెల 19న అందరూ చూసి ఆదరించాలని కోరుకుంటున్నా


డైరెక్టర్ సతీష్: నేను స్టోరీ చెప్పినప్పుడు చైతన్య గారు నన్ను నిర్మాతకు పరిచయం చేశారు. ఒక నెల రోజుల్లో టీమ్ సెట్ అయింది. ప్రతి ఒక్క టెక్నీషియన్ అద్భుతంగా పని చేశారు. తెప్పసముద్రంలో చిన్నపిల్లల మీద జరిగే అఘాయిత్యాలే కాకుండా కొన్ని స్పెషల్ ఎలిమెంట్స్ ఉన్నాయి. అవి థియేటర్లో చూస్తేనే బాగుంటుంది. ఇది చిన్న సినిమా కాదు.. కంటెంట్ ఉన్న సినిమా. కంటెంట్ ఉన్న సినిమాను మీడియా ఎప్పుడూ ఆదరిస్తుంది. అలాగే ఈ సినిమాను కూడా జనాల వద్దకు తీసుకెళ్లాలని కోరుతున్నా


హీరో అర్జున్: ఈ సినిమాకు పని చేసిన ప్రతి టెక్నీషియన్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మా నాన్న, పెద్ద నాన్ని డిస్ట్రిబ్యూటర్లు కాబట్టి నాకు చిన్న నిర్మాతల ఆవేదన తెలుసు. ఇలాంటి డైరెక్టర్, నిర్మాతకు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలి. వీళ్లకు తెలిసింది సినిమా ఒక్కటే.  ఈ సినిమా 90 శాతం షూటింగ్ పోచంపల్లిలో చేశాం. అక్కడ సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.


మరింత సమాచారం తెలుసుకోండి: