రాజకీయాల నుండి తిరిగి సినిమాల వైపు యూటర్న్ తీసుకున్న తరువాత చిరంజీవి నటించిన ‘సైరా’ మూవీ చాలవిభిన్నం. స్వాతంత్ర సమరయోధుడు ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ జీవితం ఆధారంగా తీయబడ్డ ‘సైరా’ మూవీ పై చిరంజీవి అప్పట్లో చాలఆశలు పెట్టుకుని ఆమూవీని ‘బాహుబలి’ రికార్డులను బ్రేక్ చేస్తుందని అప్పట్లో చిరంజీవి ఆశ పడ్డాడు అని అంటారు.అయితే అత్యంత భారీ బడ్జెట్ తో తీయబడ్డ ఈమూవీ సగటు ప్రేక్షకుడి అంచనాను అందుకోలేక పోవడంతో ఈమూవీ ఏవరేజ్ టాక్ తెచ్చుకుని అప్పట్లో చిరంజీవికి ఆర్థికంగా ఈమూవీ నష్టాలు తెచ్చిపెట్టింది అన్నప్రచారం జరిగింది. ఈవిషయం పై ఆరోజులలో మౌనంగా ఉన్న చిరంజీవి తన మౌనాన్ని వీడి ఈమధ్య లేటెస్ట్ గా ముంబాయికి చెందిన ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చిరంజీవి కొన్ని ఆశక్తికర కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది.ఈమూవీ వల్ల తనకు ఆర్థికంగా అప్పట్లో నష్టాలు వచ్చాయని చిరంజీవి అప్పటి విషయాలను ఇప్పుడు బయటపెట్టాడు. ఈసినిమా వల్ల తనకు ఆర్థికంగా నష్టాలు వచ్చిన విషయాన్ని వివరిస్తూ ఇలాంటి మూవీని బయట నిర్మాతలకు చేస్తే ఈమూవీకి వచ్చిన ఫలితం కారణంగా నిర్మాతలు ఎంతో నష్టపోయి ఉండేవారని అందువల్లనే ‘సైరా’ లాంటి చారిత్రాత్మక సినిమాలను భవిష్యత్ లో తాను నిర్మించే అవకాశం లేదు అంటూ మరొక షాకింగ్ కామెంట్స్ చేశాడు.ప్రయోగాత్మక సినిమాలాలో నటించాలని తనకు కోరిక ఉన్నప్పటికీ తన కోరిక నెరవేరదని భావించీ రొటీన్ మాస్ మసాల సినిమాలను చేసుకోవలసి వచ్చింది అని అంటున్నాడు. అంతేకాదు తన తమ్ముడు నాగ బాబుతో కొన్ని సంవత్సరాల క్రితం ‘రుద్రవీణ’ అన్న సినిమాలో తాను నటిస్తే ప్రేక్షకులు మంచి సినిమాను నిర్మించారు అంటూ ప్రశంసలు వచ్చిన సందర్భాన్ని గుర్తుకు చేసుకుని ఆసినిమా వల్ల తన తమ్ముడు నాగాబాబుకు నష్టాలు వచ్చిన విషయాన్ని గుర్తుకు చేసుకుంటూ భవిష్యత్ లో తాను నిర్మాతల  భవిష్యత్ ను దృష్టిలో పెట్టుకుని తాను ఆర్ట్ ఫిలిమ్స్ కు దూరంగా ఉంటున్నాను అంటూ చిరంజీవి కొన్ని ఆశక్తిర కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది..మరింత సమాచారం తెలుసుకోండి: