నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న సరిపోదా శనివారం అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు . ఈ మూవీ లో ప్రియాంక ఆరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తూ ఉండ గా ... నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి ఎస్ జె సూర్యమూవీ లో విలన్ పాత్రలో కనిపించనున్నాడు . ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన లేటెస్ట్ షూటింగ్ అప్డేట్ ఒకటి బయటకు వచ్చింది.

ఇక ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం నాని హీరో గా రూపొందుతున్న సరిపోదా శనివారం మూవీ కి సంబంధించిన మేజర్ యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణ ఇప్పటికే పూర్తి అయినట్లు ఒకే ఒక్క భారీ షెడ్యూల్ మిగిలి ఉన్నట్లు అది కూడా పూర్తి అయినట్లు అయితే ఈ సినిమాకు సంబంధించిన మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్లు ఆ తర్వాత ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఈ చిత్ర బృందం మొదలు పెట్టబోతున్నట్లు తెలుస్తోంది . ఇక పోతే గతంలోనే నాని హీరో గా రూపొందిన నానిస్ గ్యాంగ్ లీడర్ సినిమాలో ప్రియాంక అరుణ్ మోహన్ హీరోయిన్ గా నటించింది.

ఈ సినిమాలో వీరి జంటకు మంచి గుర్తింపు లభించింది . ఇక పోతే నాని హీరో గా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో గతంలో అంటే సుందరానికి అనే సినిమా రూపొందింది. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినప్పటికీ విమర్శకుల నుండి మాత్రం మంచి ప్రశంసలను అందుకుంది. ఇక వీరి కాంబోలో రూపొందుతున్న రెండవ సినిమా కావడంతో సరిపోదా శనివారం మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: