మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" మూవీ లో హీరో గా నటించి గ్లోబల్ స్టార్ గా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత చరణ్ తన తండ్రి అయినటువంటి చిరంజీవి హీరో గా రూపొందిన ఆచార్య సినిమాలో ఓ చిన్న పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టింది. అయినప్పటికీ చరణ్ మాత్రం తన నటనతో ప్రేక్షకులను భాగానే ఆకట్టుకున్నాడు.  

ప్రస్తుతం చరణ్ , శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ లో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఈ సంవత్సరం అక్టోబర్ లేదా సెప్టెంబర్ నెలలో విడుదల చేసే అవకాశం ఉన్నట్లు చరణ్ తాజాగా ప్రకటించాడు. ఇకపోతే చరణ్ ఇప్పటికే గేమ్ చేంజర్ మూవీ తర్వాత రెండు మూవీలను సెట్ చేసి పెట్టుకున్నాడు.

అందులో భాగంగా చరణ్ "గేమ్ చేంజర్" మూవీ షూటింగ్ పనులు పూర్తిగా గానే బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందబోయే సినిమాలో హీరోగా నటించబోతున్నాడు. ఈ మూవీ చరణ్ కెరీర్ లో 16 వ మూవీ గా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ తర్వాత సినిమాని కూడా చరణ్ ఇప్పటికే ఒకే చేసుకున్నాడు. చరణ్ తన కెరీయర్ లో 17 వ మూవీ ని టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయబోతున్నాడు.

మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఇకపోతే ప్రస్తుతం చరణ్ నటిస్తున్న గేమ్ చేంజర్ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో అలాగే బుచ్చిబాబు సనా , సుకుమార్ దర్శకత్వంలో రూపొందబోయే సినిమాపై కూడా అంతకుమించిన అంచనాలు ప్రేక్షకుల్లో నెలకొనే అవకాశాలు ఉన్నాయి. ఇలా చరణ్ తన తదుపరి 2 మూవీ లను అదిరిపోయే రేంజ్ లో సెట్ చేసి పెట్టుకున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: