అల్లరి నరేష్ ప్రస్తుతం "ఆ ఒక్కటి అడక్కు" అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ మూవీ లో జాతి రత్నాలు సినిమా లో హీరోయిన్గా నటించి సూపర్ క్రేజ్ ను సంపాదించుకున్న బ్యూటీ  ఫరియా అబ్దుల్లా హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... మళ్లీ అంకం ఈ మూవీ కి దర్శకత్వం వహిస్తున్నాడు . ఈ సినిమాను ఈ సంవత్సరం సమ్మర్ లో విడుదల చేయనున్నట్లు ఈ మూవీ యూనిట్ చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించింది. 

కానీ అప్పుడు ఈ సినిమా విడుదల తేదీని మాత్రం ఈ మూవీ యూనిట్ ప్రకటించలేదు . తాజాగా ఆ ఒక్కటి అడక్కు చిత్ర బృందం ఈ సినిమాను ఈ సంవత్సరం మే 3 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా థియేటర్ లలో విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ చిత్ర బృందం విడుదల చేసిన పోస్టర్ లో అల్లరి నరేష్ , ఫరియ అబ్దుల్లా ఇద్దరు పెళ్లి దుస్తుల్లో ఉన్నారు.

ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఈ మధ్య కాలంలో వరుసగా అల్లరి నరేష్ వైవిధ్యమైన సినిమాలలో .... సీరియస్ పాత్రలో నటిస్తూ వస్తున్నాడు. చాలా రోజుల తర్వాత నరేష్ ఫుల్ లెన్త్ కామెడీ ఎంటర్టైనర్ గా నటించిన సినిమా కావడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మరి జనాల్లో మంచి అంచనాలు కలిగిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మే 3 వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. ఇప్పటి వరకు ఈ సినిమా నుండి చిత్ర బృందం విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: