దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన "ఆర్ ఆర్ ఆర్" సినిమాలో హీరోగా నటించి గ్లోబల్ గా క్రేజ్ ను సంపాదించుకున్న యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర అనే భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన గుర్తింపు కలిగిన నటులలో ఒకరు అయినటువంటి సైఫ్ అలీ ఖాన్ ఈ సినిమాలో ప్రధాన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నాడు.

అనిరుధ్ రవిచంద్రన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో మెల్లి మెల్లిగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమాకు సంబంధించిన అన్ని ఏరియాల థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తుంది. అందులో భాగంగా కొన్ని రోజుల క్రితమే ఈ చిత్ర బృందం ఈ సినిమా యొక్క నార్త్ ఇండియా థియేటర్ హక్కులను అమ్మి వేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ యూనిట్ విడుదల చేసింది.

ఇక తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను కూడా అమ్మివేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను సితార ఎంటర్టైన్మెంట్ సంస్థ వారు ఏకంగా 120 కోట్ల కంటే ఎక్కువ డబ్బుతో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అలా ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను సితార సంస్థ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: