టాలీవుడ్ యువ నటుడు విజయ్ దేవరకొండ తాజాగా ఫ్యామిలీ స్టార్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించగా ... పరుశురామ్ పేట్లా ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించగా ... గోపి సుందర్ మ్యూజిక్ అందించాడు. ఈ మూవీ ఏప్రిల్ 5 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ లలో మంచి అంచనాల నడుమ విడుదల అయ్యింది. ఈ మూవీ ఇప్పటి వరకు 11 రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 12 రోజుల్లో వచ్చిన కలెక్షన్ ల వివరాలు తెలుసుకుందాం.

మూవీ కి 11 రోజుల్లో నైజాం ఏరియాలో 4.96 కోట్ల కలెక్షన్ లు దక్కగా ... సీడెడ్ ఏరియాలో 95 లక్షలు ... ఉత్తరాంధ్రలో 1.09 కోట్లు ... ఈస్ట్ లో 69 లక్షలు ... వెస్ట్ లో 57 లక్షలు ... గుంటూరు లో 71 లక్షలు ... కృష్ణ లో 66 లక్షలు ... నెల్లూరు లో 54 లక్షల కలెక్షన్ లు దక్కాయి. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 11 రోజుల్లో 10.27 కోట్ల షేర్ ... 18.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఈ మూవీ కి 11 రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 1.39 కోట్లు కలెక్షన్ లు దక్కగా ... ఓవర్ సీస్ లో 4.86 కోట్ల కలెక్షన్ లు దక్కాయి. ఇక ఈ మూవీ కి 11 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 16.42 కోట్ల షేర్ ... 31.25 కోట్ల గ్రాస్ కలెక్షన్ లు దక్కాయి. ఇకపోతే ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 43 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 44 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారి లోకి దిగింది. ఈ మూవీ మరో 31.40 కోట్ల షేర్ కలక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టినట్లు అయితే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

vd