టాలీవుడ్ యువ నటుడు సిద్దు జొన్నలగడ్డ తన కెరియర్ ప్రారంభంలో చాలా సినిమాల్లో చిన్న చిన్న పాత్రలో నటించాడు. అలా కొంత కాలం పాటు కెరియర్ ను కొనసాగించిన ఈయన ఆ తర్వాత గుంటూరు టాకీస్ అనే సినిమాలో హీరోగా నటించాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ హీరోకు సక్సెస్ ను అందించలేక పోయింది. ఆ తర్వాత ఈయన పలు సినిమాలలో హీరోగా నటించాడు. 

అవి పరవాలేదు అనే స్థాయిలో మాత్రమే ప్రేక్షకులను అలరించాయి. అలా కెరియర్ కింద పైన పడుతూ సాగుతున్న సమయం లోనే ఈ నటుడు డీజే టిల్లు అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ సూపర్ సక్సెస్ కావడం ఇందులో సిద్దు తన నటనతో , హవా భావాలతో , డ్రెస్సింగ్ స్టైల్ తో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ నటుడికి ఓవర్ నైట్ లోనే సూపర్ క్రేజ్ లభించింది. తాజాగా సిద్దు డీజె టిల్లు మూవీవకి కొనసాగింపుగా రూపొందిన టిల్లు స్క్వేర్ అనే సినిమాలో హీరో గా నటించాడు. అనుపమ పరమేశ్వరన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటించింది.

సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ నిర్మించిన ఈ మూవీ లో నేహా శెట్టి ఈ ముఖ్యమైన పాత్రలో నటించింది. మార్చి 29 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా ఇప్పటి వరకు చాలా రోజుల బాక్స్ ఆఫీస్ రన్ ను కంప్లీట్ చేసుకుంది. అందులో భాగంగా ఈ మూవీ సూపర్ సాలిడ్ కలెక్షన్ లను వసూలు చేసింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 125.2 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ సూపర్ గా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

sj