సినీ ఇండస్ట్రీలో ఎంత కష్టపడ్డా కూడా కొంతమందికి అసలు అవకాశాలు దొరకవు. కొంతమందికి  చిన్న చిన్న అవకాశాలు దొరుకుతాయి. కానీ కొంతమందికి ఏమాత్రం అనుకోకుండానే అదృష్టం వరిస్తుంది. అలా వాళ్ళు పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశం వస్తుంది. మరీ ముఖ్యంగా బిగ్ బాస్ హౌస్ కి వెళ్లి వచ్చిన తర్వాత ఆ నటీనటులకు మంచి మంచి అవకాశాలు వస్తాయి. కొందరికి చిన్న అవకాశాలు వచ్చినా కూడా కొందరికి మాత్రం పెద్ద పెద్ద సినిమాల్లో నటించే అవకాశాలు వస్తాయి. అలా తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 పూర్తయింది. అందులో పాల్గొన్న వారిలో కొంతమందికి మంచి అవకాశాలు వచ్చాయి.

ఇక ఆ హౌస్ లోకి వెళ్లి వచ్చిన సింగర్ రాహుల్ సిప్లి గంజ్ ఇప్పుడు ఏ స్థాయిలో ఉన్నాడో ప్రత్యేకంగా చెప్పడం అవసరం లేదు. ఆస్కార్ వరకు వెళ్లి వచ్చాడు రాహుల్ సిప్లింగ్. ఈ మధ్యకాలంలో నటి సిరి హనుమంతు సైతం బాలీవుడ్ లో షారుక్ ఖాన్ నటించిన జవాన్ సినిమాలో ఒక కీలక పాత్రలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఇప్పుడు అలాంటి ఒక అవకాశం  దక్కించుకుంది రతిక. సినీ ఇండస్ట్రీలో సోషల్ మీడియా ద్వారా ఎంతో మంచిది గుర్తింపుని తెచ్చుకుని ఈ బ్యూటీ బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది.

అలా షో నుండి బయటకు వచ్చిన తర్వాత పలు సినిమాలో నటించే అవకాశాన్ని తెచ్చుకుంది.. తాజాగా ఆమె జాక్ పాట్ ఆఫర్ కొట్టేసింది అన్న వార్త వైరల్ గా మారింది. ఆమె ఏకంగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి సినిమాలో కీలకపాత్రకోసం సెలక్ట్ అయ్యిందని తెలుస్తోంది. సిరీ హనుమంత్ షారుఖ్ సినిమాలో నటిస్తే రతిక రోజు విజయ్ సినిమాలో నటించబోతుందట .దీనికి సంబంధించిన న్యూస్ కొలీవుడ్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది .  విజయ్ దళపతి సినిమాలో ఛాన్స్ అంటే అంత ఈజీ కాదు.. చిన్న చిన్న నటులకు ఇలా మంచి పాత్ర రావాలి అంటే ఎంతో అదృష్టం ఉండాలి. ఆ లక్కీ లాటరీ రతికకు దొరికింది..!!

మరింత సమాచారం తెలుసుకోండి: