ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో అనేక క్రేజీ సినిమాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. వాటి గురించి ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక అంత క్రేజ్ ఉన్న సినిమాలకు అదే రేంజ్ లో బిజినెస్ కూడా జరుగుతుంది. పెద్ద పెద్ద సంస్థలు ఈ సినిమాల యొక్క హక్కులను దక్కించుకోవడానికి పోటీ పడుతున్నాయి. మరి ఆ క్రేజీ మూవీ లు ఏవి ..? అనే విషయాలను తెలుసుకుందాం.

ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో తెరకెక్కుతున్న మోస్ట్ క్రేజీయేస్ట్ ప్రాజెక్టు లలో కల్కి 2898 ఏడి , పుష్ప పార్ట్ 2 ,  దేవర , గేమ్ చేంజర్ ఈ నాలుగు మూవీలపై ఇండియా వ్యాప్తంగా ఉన్న సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు పుష్ప పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం ఆగస్టు 15 వ తేదీన విడుదల చేయనున్నట్లు , దేవర పార్ట్ 2 మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఈ చిత్ర బృందాలు అఫిషియల్ గా ప్రకటించాయి. ఇక కల్కి , గేమ్ చేంజర్ మూవీ ల విడుదలకు సంబంధించి పక్కా క్లారిటీ ఇన్ఫర్మేషన్ లేదు.


ఇకపోతే ఇప్పటికే ఈ నాలుగు సినిమాలకు సంబంధించిన నార్త్ ఇండియా థియేటర్ హక్కులను భారీ ధరకు ఓ ప్రముఖ సంస్థ దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ కలిగిన ఏ ఏ ఫిలిమ్స్ సంస్థ అధినేత అనిల్ తడని ఈ నాలుగు మూవీ ల యొక్క నార్త్ ఇండియా హక్కులను భారీ ధరకు కొనుగోలు చేసినట్లు అందులో భాగంగా ఈ నాలుగు సినిమాలను కూడా ఈయన నార్త్ ఇండియాలో పెద్ద మొత్తంలో విడుదల చేయడానికి ఇప్పటి నుండే ప్రాణాలికలను వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నాలుగు సినిమాలు కూడా అనుకున్నంత స్థాయి విజయాన్ని అందుకున్నట్లు అయితే తెలుగు సినిమా స్థాయి మరింత పెరుగుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: