టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి విక్టరీ వెంకటేష్ హీరోగా తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో ఒకరు అయినటువంటి అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరికొన్ని రోజుల్లో ఓ మూవీ స్టార్ట్ కాబోతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించబోతున్నాడు. గతంలోనే వెంకటేష్ హీరోగా అనిల్ రావిపూడి కాంబోలో ఎఫ్ 2 , ఎఫ్ 3 అనే సినిమాలు రూపొందాయి. 

మూవీ లు మంచి విజయాలు సాధించాయి. దానితో విరి కాంబోలో తెరకెక్కబోయే మూడవ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే తాజాగా ఈ మూవీ బృందం వారు కాస్టింగ్ కాల్ ను ఆఫర్ చేసింది. అందులో భాగంగా ఈ సినిమాలో నటించడానికి ఎవరు అర్హులు. వారికి ఎలాంటి భాష వచ్చి ఉండాలి. ఏ వయసు వారు ఈ మూవీ కి కావాలి. అలాగే మరికొన్ని వివరాలను కూడా ఇందులో ఈ మూవీ యూనిట్ తెలియజేసింది. ఆ వివరాలను తెలుసుకుందాం. ఈ మూవీ లో నటించాలి అనుకునే వారికి కచ్చితంగా గోదావరి భాష వచ్చు ఉండాలి.

అని అలాగే చిన్న పిల్లల్లో మగవారు అయితే 6 నుండి 12 సంవత్సరాల వయసు కలిగిన వారు అయి ఉండాలి. అదే అమ్మాయిలు అయితే 6 నుండి 14 సంవత్సరాల వయసు కలిగిన వారు ఉండాలి. ఇక అమ్మాయి లలో 25 నుండి 55 సంవత్సరాల వయసు మధ్య ఉన్నవారు ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. అలాగే అబ్బాయిలు 25 నుండి 55 మధ్య వయసు ఉన్న వారు కూడా ఎవరైనా ఇందులో పాల్గొనవచ్చు. ఇక అందుకు సంబంధించిన వివరాలు అన్నింటిని కింద తెలియజేసిన మెయిల్ ఐడి మరియు వాట్సాప్ కు పంపగలరు అని ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: