తెలుగు సినీ పరిశ్రమలో నటుడిగా , దర్శకుడుగా మంచి గుర్తింపును సంపాదించుకున్న వారిలో విశ్వక్ సేన్ ఒకరు. ఈయన ఇప్పటికే ఎన్నో సినిమాలలో నటించి అందులో అనేక మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకోడం మాత్రమే కాకుండా పలకనామ దాస్ , దాస్ కా దమ్కి అనే రెండు సినిమాలకు దర్శకత్వం వహించి ఈ సినిమాలతో కూడా విజయాలను అందుకొని దర్శకుడిగా కూడా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. 

తాజాగా ఈ నటుడు గామి అనే ఓ వైవిధ్యమైన సినిమాలో హీరో గా నటించాడు. కొన్ని రోజుల క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని నేహా శెట్టి హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... అంజలిమూవీ లో ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతోంది.

ఈ సినిమాకు కృష్ణ చైతన్య దర్శకత్వం వహిస్తూ ఉండగా ... సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత సూర్య దేవర నాగ వంశీ ఈ మూవీ ని నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ మూవీ నుండి చిత్ర బృందం కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేయగా వాటికి మంచి రెస్పాన్స్ జనాల నుండి లభించింది. తాజాగా ఈ మూవీ యూనిట్ ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన అప్డేట్ ను ప్రకటించింది.

మూవీ యొక్క టీజర్ ను మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. ఈ పోస్టర్ లో జనాల మధ్య ఉన్న విశ్వక్ పైకి చేతులు లేపి దండం పెట్టి ఉన్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ మూవీ ని మే 17 వ తేదీన థియేటర్ లలో విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

vs