టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈయన తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో కొన్ని మూవీ లు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ అయ్యాయి. ఇకపోతే ఈ దర్శకుడు తాజాగా  తేజ సజ్జ హీరో గా అమృత అయ్యర్ హీరోయిన్ గా రూపొందిన హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించాడు.

మూవీ ఈ సంవత్సరం జనవరి 12 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల అయ్యింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ దాదాపు 200 కోట్లకు పైగా కలెక్షన్ లను ప్రపంచ వ్యాప్తంగా రాబట్టడంతో ఒక్క సారిగా ఈ దర్శకుడి పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది. ఇకపోతే హనుమాన్ సినిమా తర్వాత ఈ దర్శకుడు జై హనుమాన్ అనే సినిమాకు దర్శకత్వం వహించబోతున్నాడు. ఇప్పటికే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువబడింది.

ప్రస్తుతం ఈ దర్శకుడు ఓ బాలీవుడ్ స్టార్ హీరోతో సినిమా చేయబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... బాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరోలలో ఒకరు అయినటువంటి రన్వీర్ సింగ్ కి ప్రశాంత్ వర్మ తాజాగా ఓ కథను చెప్పినట్లు ... ఆ కథ ఆయనకు కూడా అద్భుతంగా నచ్చినట్లు దానితో వెంటనే ఈ యువ దర్శకుడి సినిమాలో నటించడానికి రణ్వీర్ ఓకే చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే వీరి కాంబో మూవీకి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చే అవకాశం ఉన్నట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

pv