పెళ్లి చూపులు మూవీ తో దర్శకుడిగా కెరియర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకులతో , విమర్శకులతో ప్రశంసలను అందుకున్న దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు . ఈయన ఇప్పటి వరకు తన కెరీర్ లో కొన్ని సినిమాలకు మాత్రమే దర్శకత్వం వహించినప్పటికీ చాలా సినిమాల్లో నటించా డు.

దానితో ఈయన దర్శకుడిగా ఏ స్థాయి గుర్తింపును సంపాదించుకున్నా డో ... నటుడి గా కూడా అదే స్థాయి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆఖరుగా ఈ దర్శకుడు కిడా కోలా అనే సినిమాకు దర్శకత్వం వహించాడు . అలాగే ఇందులో తరుణ్ ముఖ్యమైన పాత్రలో కూడా నటించాడు . ఈ మూవీ మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర పరవాలేదు అనే స్థాయి విజయాన్ని అందుకుంది. ఇక పోతే త్వరలోనే ఈ నటుడు ఓ బ్లాక్ బాస్టర్ మూవీ రీమేక్ లో నటించబోతున్నట్లు తెలుస్తోంది.

కొంత కాలం క్రితం మలయాళ ఇండస్ట్రీ లో మంచి విజయం సాధించిన "జయ జయ జయహే" అనే సినిమాను తెలుగు లో రీమేక్ చేయబోతున్నట్లు .. ఇందులో తరుణ్ భాస్కర్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ సినిమా భార్యా భర్తల మధ్య జరిగే గొడవల నేపథ్యంలో రూపొందింది. ఇప్పటికే ఈ సినిమా తెలుగు లో కూడా విడుదల అయ్యింది. తెలుగు ప్రేక్షకులను కూడా ఈ సినిమా బాగానే ఆకట్టుకుంది. ఇప్పటికే తెలుగు లో విడుదల అయిన ఈ సినిమాను మళ్ళీ తెలుగు లో రీమేక్ చేయడం అవసరమా అని కూడా కొంత మంది తమ అభిప్రాయాన్ని ఈ సినిమా విషయంలో చెబుతూ వస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

rb