టాలీవుడ్ యువ నటుడు తేజ సజ్జ తాజాగా హనుమాన్ అనే సినిమాలో హీరోగా నటించాడు. ఈ మూవీ లో యంగ్ బ్యూటీ అమృత అయ్యర్ హీరోయిన్ గా నటించగా ... టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 12 వ తేదీన విడుదల అయ్యి భారీ కలెక్షన్ లను వసూలు చేసి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. 

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సాలిడ్ విజయాన్ని అందుకున్న ఈ సినిమా ఆ తర్వాత "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే ఈ సినిమాకి డిజిటల్ ప్లాట్ ఫామ్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది. అలా ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా మరి కొన్ని రోజుల్లోనే బుల్లి తెర ప్రేక్షకులను కూడా అలరించబోతుంది. 

తాజాగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ సాటిలైట్ హక్కులను జీ తెలుగు సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాని ఈ సంవత్సరం ఏప్రిల్ 28 వ తేదీన సాయంత్రం 5 గంటల 30 నిమిషాలకు జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనున్నట్లు ఈ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఇప్పటికే థియేటర్ మరియు "ఓ టి టి" ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తుందో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే . ఈ మూవీలోని నటనకు గాను తేజకు ప్రేక్షకుల నుండి , విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు దక్కాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: