ఇప్పటికే ఎంతో మంది డ్యాన్స్ కొరియోగ్రాఫర్ లు సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకత్వం లో కూడా సూపర్ సక్సెస్ అయిన వారు ఉన్నారు. అలాంటి వారిలో విజయ్ బిన్నీ ఒకరు . తన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమా పాటలకు డాన్స్ కొరియో గ్రాఫర్ గా వ్యవహరించి తెలుగు సినీ పరిశ్రమలో తన కంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్నాడు. అలా డాన్స్ కొరియో గ్రాఫర్ గా మంచి గుర్తింపును సంపాదించుకున్న ఈయన కొంత కాలం క్రితమే టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరో గా ఆశికా రంగనాథ్ హీరోయిన్ గా అల్లరి నరేష్ , రాజ్ తరుణ్ కీలక పాత్రలలో నా సామి రంగ అనే సినిమాని తెరకెక్కించాడు.

మంచి అంచనాల నడుమ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 14 వ తేదీన విడుదల అయిన ఈ సినిమా మంచి విజయం సాధించింది .  దానితో దర్శకుడి గా కూడా విజయ బిన్నీ కి మంచి గుర్తింపు తెలుగు సినీ పరిశ్రమలో లభించింది. ఇకపోతే దర్శకుడి గా మంచి గుర్తింపును సంపాదించుకున్న తర్వాత కూడా ఈయన సినిమా పాటలకు కొరియోగ్రఫీ చేస్తున్నాడు. అందులో భాగంగా చిరంజీవి హీరోగా త్రిష హీరోయిన్ గా మల్లాది వశిష్ఠ దర్శకత్వంలో రూపొందుతున్న విశ్వంబర మూవీ లోని ఒక పాటకు ఇప్పటికే ఈయన కొరియోగ్రఫీ చేశాడు.

ఇకపోతే మరికొన్ని రోజుల్లోనే ఈ చిత్ర బృందం మరొక పాటను కూడా విజయ్ బిన్నీ కొరియో గ్రఫీలో చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా విజయ్ వరుసగా విశ్వంభర మూవీ కి సంబంధించిన పాటలకు కొరియో గ్రఫీ చేస్తున్నాడు. ఇది ఇలా ఉంటే విశ్వంభర మూవీ నీ వచ్చే సంవత్సరం జనవరి 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ఈ మూవీ యూనిట్ ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: