ఏ సిని ఇండస్ట్రీలో అయినా కాస్టింగ్ కౌచ్.. అమ్మాయిలను మోసం చేయడం.. వేధించడం అదేవిధంగా లేడీ ఆర్టిస్టులకు ఎదురయ్యే వివిధ రకాల ఇబ్బందుల గురించి తరచూ సోషల్ మీడియాలో ఏవో ఒక వార్తలు వస్తూనే ఉంటాయి. సోషల్ మీడియా వేదికగా దీనిపై ఎప్పటికప్పుడు పెద్ద ఎత్తున చర్చలను జరుగుతూ ఉంటారు. అయితే మీతో ఉద్యమం సమయంలో ఈ విషయంపై ఎంత పెద్ద చర్చ జరిగిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అయితే ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నటి అపూర్వ టాలీవుడ్ లో ఎదురయ్యే కాస్టింగ్ కౌచ్ గురించి సంచలన కామెంట్స్ చేసింది.

దీంతో ఆమె చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే నటి అపూర్వ వ్యాంప్ తరహా పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. అయితే ఈ పాత్రలు చేస్తూ పలు కామెడీ పాత్రల్లో కూడా నటించి అలా కూడా మంచి క్రేజ్ తెచ్చుకుంది. తెలుగు హీరోయిన్లు కమిట్మెంట్ ఇవ్వరు నార్త్ హీరోయిన్ లో కమిట్మెంట్ కి ఓకే చేస్తారు అన్న ఆలోచన చాలా మందికి ఉంది దీనిపై మీ అభిప్రాయం ఏంటి అనే యాంకర్ అపూర్వ ను అడిగారు. దీనికి స్పందిస్తూ ఆమె అలా ఎలా చెప్పగలం తెలుగు హీరోయిన్ అయినా నార్త్ హీరోయిన్

అయినా కూడా ఆ పాత్ర ఖచ్చితంగా చెయ్యాలి అని అనుకుంటే కచ్చితంగా కమిట్మెంట్ కి ఓకే చెప్తారు. ఇంకా ఓపెన్ గా చెప్పాలి అంటే కమిట్మెంట్ అనేది ఆ ఇద్దరి వ్యక్తుల మధ్య ఒక అండర్స్టాండింగ్ అంటూ వెల్లడించింది. కచ్చితంగా వారి వల్ల మాకు సినిమాలో ఆ పాత్ర చేయగలిగే అవకాశం వస్తుంది అన్న నమ్మకం హీరోయిన్ కి వస్తే ఖచ్చితంగా ఎదుటి వారికి కమిట్మెంట్ ఇవ్వడానికి ఓకే చెప్తుంది. కొందరు హీరోయిన్లకు కాస్టింగ్ కౌచ్ సమస్య లేకుండానే అవకాశాలు వచ్చాయి. అలాగని అందరు హీరోయిన్లు మాకు కాస్టింగ్ కౌచ్ సమస్యే లేదు అని చెబితే మాత్రం అది అబద్దం. నేను చూసిన వాళ్లలో భూమిక, నిత్యామీనన్ కి అలాంటి అనుభవం ఎదురుకాలేదు. ఎందుకంటే వాళ్ళకి బిగినింగ్ లోనే మంచి సినిమాలు పడ్డాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: