యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ డైరెక్షన్ లో వచ్చినటువంటి #90’s ఎ మిడిల్ క్లాస్ బయోపిక్ టీవీ సిరీస్ సూపర్ హిట్ అయ్యింది. ఈ వెబ్ సిరీస్ కి నవీన్ మేడారం నిర్మాతగా వ్యవహరించాడు. ఇకపోతే ఈ వెబ్ సిరీస్ ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ వెబ్ సిరీస్ "ఓ టి టి" లోకి ఎంట్రీ ఇవ్వక ముందు ప్రేక్షకుల్లో దీనిపై పెద్దగా అంచనాలు లేవు. కానీ ఎప్పుడూ అయితే ఈ వెబ్ సీరీస్ స్ట్రీమింగ్ కావడం మొదలు పెట్టిందో అప్పటి నుండి దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ రావడం అయ్యింది.

దానితో చివరగా ఈ వెబ్ సిరీస్ సూపర్ హిట్ ను అందుకుంది. ఇందులో శివాజీ ప్రధాన పాత్రలో నటించాడు. ఈ వెబ్ సిరీస్ ద్వారా శివాజీ కి కూడా మంచి గుర్తింపు లభించింది. ఇకపోతే ఇప్పటికే ఈ వెబ్ సిరీస్ కు దర్శకత్వం వహించిన ఆదిత్య హసన్ కి ఎన్నో సినిమా అవకాశాలు కూడా దక్కాయి. ఇకపోతే తాజాగా ఈ క్రేజీ కాంబో నుండి మరో అప్డేట్ వచ్చింది. నిన్న శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా మేకర్స్ ఈ ప్రాజెక్ట్ ను అనౌన్స్ చేయడం జరిగింది.

ఫీచర్ ఫిల్మ్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి "టీచర్" అనే టైటిల్ ను కన్ఫార్మ్ చేసారు.  స్వాతి ఇందులో లీడ్ రోల్ లో నటిస్తుంది. తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ ను చూస్తుంటే ఇది కూడా #90’s టీవీ సిరీస్ తరహా లోనే కామెడీ యాంగిల్ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. తాజాగా విడుదల చేసిన పోస్టర్ ఆడియెన్స్ ను విశేషం గా ఆకట్టుకుంటుంది. సిద్దార్థ్ సదాశివుని ఈ మూవీ కి సంగీతం అందిస్తుండగా ... అరుణ్ తచోత్ ఎడిటర్ గా ... అజీమ్ మొహమ్మద్ డిఓపి గా వ్యవహరిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

ah