శివాజీ , వాసుకి ఆనంద్ , మౌళి , వసంతిక , అనిల్ చరణ్ , రోహన్ రాయ్ ముఖ్య పాత్రలలో ఆదిత్య హసం దర్శకత్వంలో నవీన్ మేడారం నిర్మాణంలో 90'స్ - ఏ మిడిల్ క్లాస్ బయోపిక్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిన విషయం మనకు తెలిసిందే. ఈ వెబ్ సిరీస్ కొంత కాలం క్రితమే ఈటీవీ విన్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే పెద్దగా అంచనాలు లేకుండా డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ వెబ్ సిరీస్ కు మెల్ల మెల్లగా ప్రేక్షకు ఆదరణ పెరిగింది. దానితో చివరగా ఈ వెబ్ సిరీస్ కు అద్భుతమైన రెస్పాన్స్ జనాల నుండి లభించింది.

ఇకపోతే ఈ వెబ్ సిరీస్ కి దర్శకత్వం వహించిన ఆదిత్య హాసన్ కి ఏకంగా చాలా సినిమా ఆఫర్ లు కూడా వచ్చినట్లు ఆయనే స్వయంగా ప్రకటించాడు. అందులో భాగంగా ఈయన మరికొన్ని రోజుల్లోనే టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ హీరో గా ఓ మూవీ ని కూడా తెరకెక్కించబోతున్నాడు. ఇకపోతే తాజాగా ఈయన దర్శకత్వంలో రూపొందుతున్న టీచర్ మూవీ కి సంబంధించిన క్రేజీ అప్డేట్ బయటకు వచ్చింది. మరి ఈ మూవీ కి సంబంధించిన కొన్ని ఇంట్రెస్టింగ్ వివరాలను తెలుసుకుందాం. టీచర్ మూవీ లో స్వాతి రెడ్డి ప్రధాన పాత్రలో కనిపించనుండగా ... నిఖిల్ దేవాదుల , నిత్య శ్రీ మరియు మరి కొంత మంది ఈ సినిమాలో ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు.

ఆదిత్య హసన్ ఈ సినిమాకు రచనా మరియు దర్శకత్వం వహించనుండగా ... అజీమ్ మహమ్మద్ ఈ మూవీ కి సినిమాటో గ్రాఫర్ గా వర్క్ చేయనున్నాడు. సిద్ధార్థ్ సదాశివుని ఈ మూవీ కి సంగీతం అందించనుండగా ... అరుణ్ తచిత్ ఈ మూవీ కి ఎడిటర్ గా వర్క్ చేయనున్నాడు. ఎంఎన్ఓపి బ్యానర్ పై నవీన్ మేడారం ఈ సినిమాను నిర్మించబోతున్నాడు. ఇకపోతే ఈ సినిమా కామెడీ డ్రామాగా రూపొందబోతుంది. తాజాగా ఈ చిత్ర బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఒక పోస్టర్ ను విడుదల చేయగా అది ప్రస్తుతం సూపర్ గా వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: