బాలీవుడ్ లేటెస్ట్ పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ "ఆర్టికల్ 370". ఈ మూవీలో యామీ గౌతమ్ మరియు ప్రియమణి ప్రధాన పాత్రలలో నటించారు.ఈ సినిమా ఫిబ్రవరి 23న థియేటర్లలో రిలీజ్ అయి మంచి విజయం సాధించింది. ఇదిలా ఉంటే తాజాగా ఈ మూవీ థియేటర్స్ రిలీజ్ అయిన రెండు నెలలకు ఓటీటీలోకి రాబోతుంది. ఈ మూవీ శుక్రవారం (ఏప్రిల్ 19) నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.ఆదిత్య ధర్ డైరెక్ట్ చేసిన ఆర్టికల్ 370 మూవీకి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభించింది.ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ రిలీజ్ తేదీని నెట్‌ఫ్లిక్స్ అధికారికంగా అనౌన్స్ చేసింది. రేపటి (ఏప్రిల్ 19) నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. జమ్ము కశ్మీర్ కు స్వయం ప్రతిపత్తిని కల్పించే ఆర్టికల్ 370 నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.
 
సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయిన తొలి రోజే రూ.5.75 కోట్ల ఓపెనింగ్స్ సాధించింది. ఇప్పుడు ఓటీటీలో ఈ మూవీకి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందనేది చూడాలి.ఆర్టికల్ 370 జమ్ముకశ్మీర్ లోని ఉగ్రవాదం మరియు అవినీతి ఆధారంగా తెరకెక్కిన మూవీ ఇది. ఈ సినిమాలో యామీ గౌతమ్ ఓ ఇంటెలిజెన్స్ అధికారి పాత్రలో నటించింది. కశ్మీర్ లో ఉగ్రవాదం గురించి ఈ మూవీలో చూపించే ప్రయత్నం చేశారు. ఆ ఉగ్రవాదులను మట్టు పెట్టేందుకు ఎన్ఐఏలో చేరిన యామీ కశ్మీర్ ను ఎలా రక్షించిందన్నది ఈ సినిమా కథ... ఆర్టికల్ 370 గురించి సినిమాలో ఎంతో ప్రత్యేకంగా ప్రస్తావించారు.ఈ సినిమాపై డైరెక్టర్ ఆదిత్య ధార్ ఈ మధ్య ఓ ఇంటర్వ్యూలో ఇలా చెప్పకొచ్చారు "ఈ సినిమా తీయడం వెనుక నా ఉద్దేశం సరైనది. నేను సినిమా ఇండస్ట్రీలో ఉన్నంతకాలం నా ఉద్దేశం ఎప్పుడూ కూడా సరైనదిగానే ఉంటుంది. అది తప్పయిన రోజు నేను సినిమాలు తీయడం మానేస్తాను. అందుకే ఎవరు ఏమనుకున్నా కానీ నేను పట్టించుకోను" అని ఆయన అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: